Gold Rate Today: గత కొంత కాలంగా పసిడి ధరల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు పసిడి ధర తగ్గిందనే సంతోష పడే లోపే మరుసటి రోజు అమాంతం పెరిగిపోతున్నాయి. పెరుగుతూ, తగ్గుతూ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే బంగారాన్ని ఆభరణంగా మాత్రమే కాకుండా పెట్టుబడి మార్గంగా కూడా భావిస్తున్నారు. దీంతో ధరలు ఎంతగా పెరిగినప్పటికీ పసిడికి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా పసిడి ధరలు మరోమారు భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ధర ఎంత పెరిగిందంటే?
గురువారంతో పోలిస్తే దేశంలో పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్.. ఏకంగా రూ.1,950 మేర పెరిగింది. 24 క్యారెట్ల పసిడి రూ.2,120 మేర పెరిగి అందరికీ షాకిచ్చింది. ఫలితంగా దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,950 చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400 (10 గ్రాములు) పలుకుతోంది. మరోవైపు వెండి సైతం ఇవాళ భారీగా పెరిగింది. కేజీకి రూ. 1,100 మేర పెరిగింది. తద్వారా దేశంలో కిలో వెండి ధర రూ. 1,10,000 చేరింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధర
❄️ హైదరాబాద్ (Hyderabad) – రూ.92,950
❄️ విజయవాడ (Vijayawada) – రూ.92,950
❄️ విశాఖపట్టణం (Visakhapatnam) – రూ.92,950
❄️ వరంగల్ (Warangal) – రూ.92,950
24 క్యారెట్లు బంగారం ధర
❄️ విశాఖపట్టణం (Visakhapatnam) – రూ.1,01,400
❄️ వరంగల్ (Warangal ) – రూ.1,01,400
❄️ హైదరాబాద్ (Hyderabad) – రూ.1,01,400
❄️ విజయవాడ – రూ.1,01,400
వెండి ధరలు
❄️ విజయవాడ – రూ.1,20,000
❄️ విశాఖపట్టణం – రూ.1,20,000
❄️ హైదరాబాద్ – రూ.1,20,000
❄️ వరంగల్ – రూ.1,20,000