Amma Mata Anganwadi Bata: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మమాట అంగన్ వాడీ బాట’ కార్యక్రమంతో అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తిగా కార్పోరేట్ స్థాయి విద్యాసంస్థలకు ధీటుగా మారునున్నాయని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. అందోలు మండల పరిధిలోని నేరడిగుంట గ్రామంలో వేర్వురుగా నిర్వహించిన ‘అమ్మమాట–అంగన్‌వాడీ బాట’, బడిబాట కార్యక్రమాలకు ఆమె హజరయ్యారు. ఈ సందర్భంగా ఆంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం వండిన భోజనాన్ని పిల్లలకు వడ్డీంచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా క్వాలీటి విద్యనందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఆడిస్తూ పాడిస్తూ విద్యబోధన జరుగుతుందన్నారు.
అంగన్‌వాడీ కిట్ బుక్‌లో కథలు
అంగన్‌వాడీ కేంద్రాలకు కిట్‌ను అందిస్తున్నామని, అందులో చిన్న పిల్లలకు అర్థమయ్యే రితీలో వారిలో జ్ఞానాన్ని పెంపొందించేందుకు కథల పుస్తకాలను ఉన్నాయన్నారు. మా పాపకు కూడా అంగన్‌వాడీ కిట్‌లోని బుక్‌లో కథలను చెబుతున్నానని ఆమె చెప్పారు. కేంద్రాలలో మెరుగైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన ఆహరాన్ని, కేంద్రానికి వచ్చే చిన్నారులతో పాటు గర్బిణీలకు, బాలింతలకు న్యూట్రీషన్ స్నాక్స్‌ను అందిస్తున్నామని ఆమె తెలిపారు. బాలమృతం ప్యాకేట్‌లను కూడా రెగ్యులర్‌గా ఇస్తున్నామన్నారు. అంగన్ వాడీ కేంద్రాల సేవలను మహిళ సమాఖ్య సంఘాల వారు ప్రజలకు వివరించి, అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లలిత కుమారి, ఆర్‌డీవో పాండు, జోగిపేట సీడీపీవో ప్రియాంక, సూపర్ వైజర్ సంగీతతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Pakistan Water Crisis: పాక్‌లో మరింత ముదిరిన నీటి కష్టాలు.. ఖరీఫ్ సీజన్‌పై లోబోదిబో!
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి
ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. నేరడిగుంటలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు నోట్ బుక్స్, యూనిఫామ్‌లను ఆమె పంపిణీ చేశారు. ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలను కల్పిస్తున్నామని, పాఠశాల ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో పాండు, ఎంఈవో కృష్ణ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ
ప్రభుత్వం పెదొడి ఇంటి కలను నేరవేర్చేందుకు ప్రవేశపేట్టిన ఇందిరమ్మ పథకం కింద మంజూరైన లబ్దిదారులకు పత్రాలను జిల్లా కలెక్టర్ క్రాంతి చేతుల మీదుగా అందజేశారు. మొదటి విడతలో భాగంగా 35 మంది లబ్దిదారులను గుర్తించగా, వారిలో 5 మందికి మంజూరు పత్రాలను ఆమె అందించారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లను నిర్మించుకుని సొంతింటి కలను సాకారం చేసుకొవాలని ఆమె సూచించారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు కూడా సకాలంలో విడతల వారీగా అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివరాజ్, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, ఎంపీడీవో రాజేష్, ఎంపీఈవో సోమనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: ప్రపంచ పటంలో తెలంగాణ సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది..