Mahabubabad Mandal Schools (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad Mandal Schools: ఆ పాఠశాలకు ఎందుకంత దుర్గతి.. పట్టించుకోని అధికారులు

Mahabubabad Mandal Schools: ఆ పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలగా ఉండేది. అక్కడ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడంతో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉంది. అదేవిధంగా ఆ గ్రామంలో విద్యార్థులు ఎక్కువమంది ఉండడంతో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి సెకండరీ పాఠశాలగా అప్గ్రేడ్ అయింది. అంతేకాదు అక్కడ ప్రతి ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత 100% సాధిస్తూ వస్తుంది. కానీ ఆ పాఠశాలకు నిధుల లేమి లేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలకు 15 లక్షల నిధులు. సెకండరీ పాఠశాలకు 25 లక్షల నిధులు పాఠశాలల పక్క నిర్మాణాలు చేయించేందుకు సాంక్షన్ అయ్యాయి. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల అలసత్వమా? ఆ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? కారణమైన ఆ పాఠశాలకు మాత్రం ఎక్కడా లేని దుర్గతి పట్టింది. నిధులు లేవంటే అదేవిధంగా నిధులకు ఎస్టిమేషన్ వేయలేదు అంటే ఆ పాఠశాల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ నిధులు ఉంటాయి. అందుకు సంబంధించిన మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక అనుమతులు ఉంటాయి. అయినప్పటికీ ఆ పాఠశాల పక్కా నిర్మాణానికి మాత్రం నోచుకోలేక పోతుంది. అది ఎక్కడో కాదండోయ్ మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం మాధవపురం (మాజీ ఎంపీ) గ్రామం అన్ని రకాల అవకాశాలు ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.

నిధులు వెచ్చించారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారు

ఆ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధిక నిధులు వెచ్చించారు. ఆ పాఠశాల నిర్మాణానికి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో నేటికీ అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు దాదాపు 200 మంది విద్యార్థినులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అందులో విద్యాభ్యాసం చేసే మహిళ ఉపాధ్యాయులు మరో ఆరుగురు కూడా ఉంటారు. వారందరికీ కనీస వసతి మరుగుదొడ్లు లేకపోవడం శోచనీయం. ఒకరు లోపలికి వెళ్లారంటే మరికొంతమంది క్యూ పాటిస్తే తప్ప ఆ మరుగుదొడ్డిని వాడుకునేందుకు వీలుకాదు. అలాంటి దుస్థితి పై అధికారులు పూర్తిస్థాయిలో స్పందించకపోవడం. కాంట్రాక్టర్ల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఆ పాఠశాల అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. మన ఊరు మనబడి కార్యక్రమంలో దాదాపు 40 లక్షల నిధులు కేటాయించినప్పటికీ ఐదేళ్లయిన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆ పాఠశాలలోని విద్యార్థినిలు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదేమైనా సాదాసీదా గ్రామం అనుకుంటే పొరపాటే. అక్కడ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసిన సీనియర్ తెలపండిన నాయకుడి గ్రామం కావడం విశేషం.

Also Read: NIACL Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NIACL లో అప్రెంటిస్ జాబ్స్

ఎమ్మెల్యే నిధులు వెచ్చించారు కలెక్టర్ ఆదేశించారు

మహబూబాబాద్ మండలంలోని ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు రెండు పాఠశాలలుగా నిర్వహిస్తున్న ఆ పాఠశాలల ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకుండా పోతుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో నిధులు అందినప్పటికీ అప్పటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు నిర్మాణానికి నోచుకోలేదు. దాదాపు ఐదేళ్లు పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గ్రామ సందర్శనలో భాగంగా పాఠశాల దుస్థితిని తెలుసుకుని తన సిడిఎఫ్ నిధులు 13 లక్షల 50 వేలు కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికన పాఠశాలలోని మరుగుదొడ్లు ఇతర వసతి గృహాల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఓ పర్యటనలు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సైతం పాఠశాలను సందర్శించి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

ఐటిడిఏఏ శంకర్ నిర్లక్ష్యానికి విద్యార్థుల గోసలు

మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ మాధవపురం పాఠశాల దుస్థితికి స్పందించి తన సిడిఎఫ్ నిధులనుండి 13 లక్షల 50 వేలను కేటాయించారు. అదేవిధంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సైతం పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఐటీడీఏ ఏఈ గుగులోత్ శంకర్ ఆదేశించారు. అయినప్పటికీ సంబంధిత ఏఈ శంకర్ నిర్లక్ష్యంతో ప్రస్తుతం పాఠశాల నిర్మాణానికి బ్రేక్ పడుతోంది. ఇదే విషయమై గతంలో ఎమ్మెల్యే మురళి నాయక్ ఏఈ శంకర్‌ను మందలించినప్పటికీ కుక్క తోకకు రాయి కడితే సక్కగా వస్తుందా అనే చందంగా ఆయన తీరు ఉండడం గమనార్హం. గ్రామంలోని ప్రజలు ఏఈ శంకర్‌కు పలుమార్లు ఫోన్లు చేసినప్పటికీ స్పందించకపోవడం ఆయన వంతుగా కనిపిస్తోంది. నిధులు ఉండి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐదేళ్లు గడిస్తే ప్రస్తుతం ఏఈ నిర్లక్ష్యంతో మాధవపురంలోని సెకండరీ పాఠశాల భావన, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఐటిడిఏ ఏఈ శంకర్ పై శాఖపరమైన చర్యలు తీసుకొని పాఠశాల భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Maharashtra Crime: పెళ్లై 3 వారాలే.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఇలా ఉన్నారేంటమ్మ!

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ