Khammam District Farmers (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam District Farmers: వినూత్న రీతిలో మామిడి పిక్కల నుండి మొక్క తయారీ.. ఎక్కడంటే!

Khammam District Farmers: మామిడి పిక్కల నుండి మొక్కలు తయారు చేసి వివిధ ప్రాంతాల్లోని నర్సరీలకు పంపిణీ చేస్తుంటారు. ఒక్కో మొక్కకు రూ.35 నుండి 40 వరకు విక్రయిస్తారు. రాష్ట్రంలో వివిధ పంటలలో అధిక దిగుబడులు, అధిక ధరలు, అత్యధిక లాభాలు రాకపోవడంతో ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం లోక్యతండ రైతులు వినూత్న రీతిలో లాభాలు ఆర్జించేందుకు ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. మామిడి పిక్కల నుండి మొలకెత్తి ఆ తర్వాత మొక్కగా రూపాంతరం చెందే వరకు ఆ రైతులు అప్రమత్తంగా చర్యలు చేపడతారు. ఇలా మొలక దశ నుండి మొక్క వరకు అప్రమత్తమైన చర్యలను చేపట్టి పిక్కల నుండి మొక్కలను తయారు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తేలా లోక్య తండా వాసులు కొత్త ఆదాయ వనరులకు శ్రీకారం చుట్టారు. రైతులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేలా మొలక దశ నుండి మొక్క దశ వరకు ప్రత్యేకమైన చర్యలను చేపడుతూ మొక్కలుగా రూపాంతరం చెందేలా చేసి వాటి నుంచి అత్యధిక లాభాలు ఆర్జించేందుకు కొత్త రకమైన పంట వ్యాపారానికి సంబంధించిన దానిపై స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పిక్కల నుంచి మొక్కల తయారీ

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్, సిద్దిపేట జిల్లాలో కుటీర పరిశ్రమగా మారి మామిడిపళ్ళతో ఒరుగులు తయారు చేస్తూ తద్వారా పోటీ రూపంలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అలా మామిడి పండ్ల ద్వారా తీసిన పిక్కలను లోక్యా తండావాసులు ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. అక్కడి నుంచి ఒక్కో ట్రక్కును 35 వేల నుంచి 50 వేల వరకు పిక్కలను కొనుగోలు చేస్తారు. తమ వ్యవసాయ క్షేత్రాల్లోకి తీసుకొచ్చాక పిక్కలను శుద్ధి చేస్తారు. ఒక్కో పిక్కను ఒక్కో ప్లాస్టిక్ కవర్లో ఉన్న మట్టిలో ప్యాక్ చేస్తారు. అలా పిక్కలతో తయారుచేసిన ప్యాకెట్లను ఓ ప్రాంతంలో ఉంచి తట్టు బస్తాలను వాటిపై ఉంచుతారు. తర్వాత తట్టు బస్తాల కింద ఉన్న పిక్క కవర్లపై నీటిని 15 రోజులపాటు చల్లుతారు. అలా 15 రోజులు గడిచాక పిక్కలో నుండి మొలక దశకు వస్తాయి. అటు తర్వాత మొలక కాస్త మొక్కగా మారే సమయానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న నర్సరీ నిర్వాహకులకు ఒక్కో మొక్కను రూ.35 నుండి రూ.40 వరకు విక్రయిస్తారు. అలా ఓ వినూత్నమైన రీతిలో రైతులు మొక్కలను విక్రయించి అత్యధిక లాభాలను ఆర్జిస్తూ ఇతర ప్రాంతాల రైతులకు లోక్యతండ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: Air India Plane Crash: విమానం ప్రమాదంపై వెలుగులోకి సంచలన నిజాలు

15వేల మొక్కలకు ఆరు లక్షల ఆదాయం

మొలక దశ నుంచి మొక్కగా మారిన తర్వాత లోక్యతండవాసులు ఒక్కో మొక్కను 35 నుండి 40 రూపాయల వరకు నర్సరీల నిర్వాహకులకు విక్రయిస్తారు. అలా 15 వేల మొక్కలకు దాదాపు 6 లక్షల ఆదాయం వస్తుంది. అందులో నుంచి పిక్కల కొనుగోలు, మొలక ఉత్పత్తి, మొక్క తయారీ వరకు అయిన ఖర్చులను మినహాయిస్తే ఆరు లక్షలలో నుండి దాదాపు ఒక్కో రైతుకు మూడు లక్షల వరకు సగటుగా ఆదాయం ఆర్జిస్తున్నారు. అంటే కేవలం ఈ తంతు మొత్తం కావడానికి దాదాపు 30 నుంచి 40 రోజులు మాత్రమే పడుతుంది. అంటే రైతు 40 రోజుల కష్టం, మూడు లక్షల వ్యయానికి మరో మూడు లక్షల ఆదాయం సమకూర్చుకుంటుండడం ఇక్కడ లోక్యతండ రైతుల ప్రత్యేకత. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆరు నెలలు పంట పండిస్తే గాని అది కూడా అధిక దిగుబడితో పాటు అత్యధిక ధర పలికితే వ్యవసాయం చేసే రైతుకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఇలా వ్యవసాయం చేసిన రైతుకు పిక్కల ద్వారా మొక్కగా రూపాంతరం చేసి వ్యాపారం చేస్తున్న లోక్యతండ రైతులకు ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రమంతా ప్రభుత్వం సహా వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలైన కొత్త వంగడాలను తీసుకురావడంతోపాటు పంట మార్పిడీలను సైతం చేయించిన లోక్యతండ రైతులు ఆర్జిస్తున్న లాభాల ముందట దిగదుడుపుగానే చెప్పుకోవాలి.

15వేలకే 3 లక్షల ఆదాయం వస్తే

పిక్కల నుండి మొలక ఆ తర్వాత మొక్కగా అభివృద్ధి చెందిన వాటి ద్వారా 15 వేల మొక్కలకే 3 ఆదాయం వస్తే ఒక్కో రైతు 15 లక్షల నాణ్యమైన మామిడి మొక్కలుగా తయారు చేస్తే ఆ ఆదాయం ఊహించలేని లెక్కల కిందకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. లెక్కలను బట్టి చూస్తే దాదాపు15 లక్షల మామిడి మొక్కలను తయారుచేసిన రైతు నాలుగున్నర కోట్ల ఆదాయం ఆశించవచ్చు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది.

10 సంవత్సరాలుగా లోక్యతండ వాసుల వ్యాపారం ఇదే

ఆ తండావాసులు అన్ని రకాల పంటలను ఆశించిన స్థాయిలో పండించినప్పటికీ అత్యధిక ధరలు లేకపోవడంతో కొత్త ఆలోచన వైపు పరుగులు తీశారు. అదే ఆ రైతుల కళ్ళల్లో ఆనందాన్నిచ్చింది. అత్యధిక లాభాల వైపు అడుగులు వేసేలా చేసింది. నేడు వ్యవసాయం చేస్తే రానీ లాభాలు పిక్కల వ్యవసాయంతో వస్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండ రైతులు సంప్రమాశ్చర్యాల్లో మునిగి తేలుతున్నారు.

AlsoRead: Serilingampally: వరద నీటితో మునిగిని లింగంపల్లి అండర్ బ్రిడ్జి!

వడిత్యమా ఆశ, మహిళ రైతు

ఎన్ని రకాల పంటలు పండించిన మద్దతు ధర లభించలేదు. అనుకున్న స్థాయిలో దిగుబడి కూడా రాలేదు. ఈ క్రమంలోనే ఏం చేస్తే లాభాలు వస్తాయో అనే దిశగా ఆలోచించాము. మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల నుండి మామిడి పిక్కలను ఒక్కో ట్రక్కుకు 40 వేలు వెచ్చించి తీసుకొచ్చాం. ఆ పిక్కలను ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న మట్టిలో ఉంచి మొలక దశ నుండి మొక్కగా రూపాంతరం చెందినంత వరకు తగిన జాగ్రత్తలతో పెంచాం. నీటి వసతులు, అప్రమత్తమైన జాగ్రత్త చర్యలతో మొక్కలుగా రూపాంతరం చెందాక విక్రయిస్తున్నాం. ప్రస్తుతం ఈ పంట ద్వారా అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాం. రైతు కుటుంబానికి రావాల్సినంత ఆదాయంతో పాటు ఆత్మస్థైర్యం పొందడంతో నేడు తలెత్తుకొని జీవిస్తున్నాం.

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు