Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఈ మధ్య ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? కనీసం సోషల్ మీడియాలో (Social Media) అయినా ఫొటోలు చూశారా? చూసే ఉంటార్లేండి.. ఎలా ఉన్నారంటారు? అదేనండోయ్.. టీ షర్టు, షార్టులో అదిరిపోయారు కదా? అసలు ఆ లుక్ చూస్తేనే అవాక్కయ్యారు కదా? మీరే కాదండోయ్.. వామ్మో ఈయన తమ అభిమాన హీరోనేనా? అని పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలే ఒకింత ముక్కున వేలేసుకున్నారట. ఇక విమర్శకులు, నెటిజన్లు అయితే ఓరి బాబోయ్ ఇదేలా సాధ్యం రా అయ్యా? అంటూ కంగుతిన్నారు కూడా. అయినా పవన్ కళ్యాణ్ బరువు తగ్గారా? లేకుంటే కవరింగ్ చేస్తున్నారా? లేదంటే ఫిట్‌నెస్‌కు సంబంధించిన బెల్ట్ ఏమైనా వాడుతున్నారా? అని కొందరు లేనిపోని అనుమానాలు తెరపైకి తెస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరికి తోచినట్లుగా వాళ్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమెంత? ఎందుకిన్ని డౌట్స్? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం రండి..
Read Also- Pawan Kalyan: సెలూన్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఓ రేంజిలో ఆడుకుంటున్నారుగా!
ఇదీ అసలు సంగతి..
పవన్ కళ్యాణ్ రెండ్రోజుల క్రితం విజయవాడలో తన హెయిర్ స్టైలిస్ట్ రామ్ కోనికి ‘సెలూన్ కొనికి’ని (Saloon Koniki) ప్రారంభించారు. వాకింగ్, జాగింగ్ కోసం వచ్చినట్లుగా సరదాగా టీ షర్టు, షార్ట్‌లో వచ్చి ఓపెనింగ్ చేసి, హెయిర్ కటింగ్ చేయించుకొని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే మునుపటిలా లేకుండా ఆయన సరికొత్త లుక్‌లో కనిపించేసరికి అభిమానులు, పార్టీ శ్రేణులు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఎందుకంటే.. ఈ మధ్యనే పవన్ మహా కుంభమేళాలో పవిత్రస్నానం ఆచరించడానికి వెళ్లగా ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఆయన్ను ప్రత్యర్థి పార్టీకి చెందిన కొందరు నోటికొచ్చినట్లుగా, రాయలేని విధంగా తీవ్ర పదజాలంతో కామెంట్స్, అంతకుమించి ట్రోల్ చేశారు. అయితే సేనాని మాత్రం ఎక్కడా ఫీలవ్వలేదు, స్పందించలేదు కూడా. పొట్ట మరీ ఎక్కువగా ఉండటం, ఈ మధ్య అస్సలే జిమ్ జోలికి వెళ్లలేదన్నట్లుగా ఒకింత పార్టీ అభిమానులు కూడా ఫీలయ్యారు. అయితే కేవలం 4 నెలలు.. సరిగ్గా చెప్పాలంటే 110 రోజుల్లోనే కరెంట్ తీగలాగా.. ఎవరూ ఊహించనంత ఫిట్‌గా పవన్ తయారయ్యారు. ఒక్కసారి అప్పట్లో పుష్కరాల ఫొటో, ఇప్పుడు సెలూన్ ఓపెన్ చేసిన ఫొటోలు చూస్తే ఎంత తేడా ఉందో మీకే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. నిజంగా 53 ఏళ్ల వయస్సులో పవన్ నిజంగా ఈ రేంజిలో కష్టపడి జిమ్‌లో చెమటోడ్చారంటే ఆషామాషీ విషయమేమీ కాదు.
కాస్త చెప్పొచ్చుగా గురు!
అప్పట్లో పవన్ బాడీ షేమింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా ఎంతలా ట్రోలింగ్స్, కామెంట్స్ వచ్చాయో.. ఇప్పుడు లేటెస్ట్ ఫొటోలు అంతకుమించి వైరల్ అవుతున్నాయి. యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించిన పవన్‌ను చూసిన అభిమానులు ఖుషీ అవుతూ.. పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రత్యర్థులు, వేరే హీరోల అభిమానులు.. మరీ ముఖ్యంగా వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు అయితే లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘ అబ్బే.. మేం నమ్మం.. అస్సలు నమ్మే ప్రసక్తే లేద’ని సెటైర్లు వేస్తున్నారు. ఇలా పొట్టను కవర్ చేయడానికి ఈ మధ్య బట్టలు, బెల్ట్‌లు గట్టిగానే నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. బహుశా ఆ బెల్ట్ వాడటంతో ఇలా మునుపటిలా కాకుండా బాడీ మొత్తం కవర్ అయ్యిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ బిజిబిజీగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీంతో రెండింటినీ మేనేజ్ చేయడం మామూలు కథేమీ కాదు. వాస్తవానికి ఈ మధ్య పవన్ ఎక్కడా కనిపించట్లేదు. ఏదైనా పర్యటనలు, కేబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు తప్పితే ఎక్కడా కనిపించలేదు. ఈ ఖాళీ సమయం అంతా జిమ్‌లోనే గడిపారని.. రాత్రింబవళ్లు తేడా లేకుండా చెమటలు చిందించారని తెలుస్తున్నది. ముంబై నుంచి ఇద్దరు జిమ్ ట్రైనర్లు.. పవన్‌ను ఇలా తీర్చి దిద్దారని తెలిసింది. పవన్ బాడీలో వచ్చిన ట్రాన్సఫర్మేషన్ విమర్శకులను సైతం సర్‌ప్రైజ్ చేస్తోంది. దీంతో ఒకప్పుడు ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు ‘వావ్.. నీకు నువ్వే సాటి’ అని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఇంకొందరైతే జరిగిందోదే జరిగిపోయిందిలే గురూ.. ‘కొంచెం ఆ డైట్ ప్లాన్ చెప్పి పుణ్యం కట్టుకోండయ్యా..’ అంటూ రిక్వెస్ట్ చేస్తూనే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?