Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త గెటప్‌లో మెరిశారు. ఎప్పుడు వైట్ అండ్ వైట్‌లో పవన్.. ఒక్కసారిగా టీ షర్టు, షార్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదంతా ఏదో సినిమా షూటింగ్ లేదంటే.. వాకింగ్ వెళ్లినప్పుడు ఈ లుక్‌లో కనిపించారని అనుకుంటున్నారు కదా? అస్సలు కాదండోయ్.. ఇదంతా ఓ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఇలా కనిపించారు. పూర్తి వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరులో సెలూన్ షాప్ ఓపెనింగ్‌లో పవర్ స్టార్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ‘సెలూన్ కొనికి’ని పవన్ ప్రారంభించారు. సెలూన్‌లో ఓ ఫ్యాన్ బాయ్.. పవన్‌ను నేరుగా చూసే సరికి ఎమోషన్ అయ్యి హగ్ చేసుకున్నారు. ఆ బుడ్డోడిని ఓదార్చి కాసేపు ముచ్చటించారు సేనాని. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao), ఇతర జనసేన, టీడీపీ (Janasena, TDP) నేతలు పాల్గొన్నారు. పవన్ తమ ప్రాంతానికి వచ్చారని అభిమానులు, జనసేన కార్యకర్తలు.. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చూశారు. దీంతో ఆ ప్రాంతం అంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కాగా, ఈ సెలూన్ అంతర్జాతీయ ఉత్పత్తులతో కూడిన ఉన్నత స్థాయి సేవలకు ప్రసిద్ధి చెందింది. ఈ సెలూన్.. పవన్ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ రామ్ కోనికి ది.
Read Also- TDP: టీడీపీకి ఊహించని ఝలక్.. అవాక్కైన అధిష్టానం.. కీలక నేత రాజీనామా వెనుక!
హాయ్.. హలో!
సెలూన్ ప్రారంభోత్సవం అనంతరం డిప్యూటీ అభిమానులు, కార్యకర్తలకు హాయ్, హలో అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. కారు ఎక్కుతున్న సమయంలో అభిమానులకు నమస్కారం పెట్టి తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలో అభిమానులంతా ‘డిప్యూటీ సీఎం, పవర్ స్టార్, ఓజీ, హరిహర వీరమల్లు.. జై పవన్‘ అంటూ అరిచారు. కొందరు పవన్‌తో కలిసి ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. మరికొందరేమో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) బ్యానర్లు, ఫ్లెక్సీలు పట్టుకొచ్చి పవన్‌కు చూపించారు. కాగా, సెలూన్ ప్రారంభోత్సవానికి పవన్ చాలా సింపుల్‌గా టీషర్ట్, షార్ట్‌లో కనిపించడంతో అభిమానులంతా ముచ్చట పడుతున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. పవన్ డిప్యూటీ సీఎం అయినప్పట్నుంచీ అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్య అభిమానులు, కార్యకర్తలకు కాస్త గ్యాప్ వచ్చిందని చర్చించుకుంటున్న పరిస్థితుల్లో ఇలా పలకరించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ చాలా రోజుల తర్వాత ఇలా బయటికి వచ్చేసరికి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Read Also- Savitha: మంత్రి సవితకు ఏమైంది.. ఈ వీడియోలో నిజమెంత?
గట్టిగానే..
పవన్ తన వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ రామ్ కోనికి స్థాపించిన ‘సెలూన్ కోనికి’ని ప్రారంభించడంపై గట్టిగానే విమర్శలు, సెటైర్లు వస్తున్నాయి. ముఖ్యంగా, రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తి వ్యక్తిగత వ్యాపారాలకు మద్దతు ఇవ్వడంపై ప్రత్యర్థులు, వైసీపీ శ్రేణుల (YSRCP) నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా, ప్రముఖులు వ్యాపార ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం సర్వ సాధారణే అయినా విమర్శలు మాత్రం తప్పట్లేదు. వావ్.. ఓ భారీ పరిశ్రమ (హెయిర్ సెలూన్) కోసం పెద్ద ఎత్తున అభిమానులతో తరలివచ్చి.. రిబ్బన్ కట్ చేసి బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ శ్రేణులు, విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు.. ఈ భారీ కంపెనీ ఓపెనింగ్‌కు టీషర్ట్, షార్ట్‌లో రావడం ఎనిమిదో వింత అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరేమో ‘నిక్కర్ ఏసుకొని పెద్ద పరిశ్రమ ఓపెన్ చేసిన పవన్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న గుడివాడ అమర్‌ను ట్రోల్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు కామెంట్స్ చేసేస్తున్నారు. ఈ కామెంట్స్‌కు గట్టిగానే జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే.. ‘ఏరా సాంబ.. మన హీరోగారు ఫస్ట్ స్టైమ్ ఈ లుక్‌లో వచ్చారుగా ఎలా ఉందంటావ్’ అంటూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.
Read Also- Udaya Bhanu: ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసిన యాంకర్ ఉదయభాను.. వీడియో వైరల్!
కానూరులో సెలూన్ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
10వేల ఉద్యోగాల పరిశ్రమ తెచ్చినట్టు షో ఏంట్రా అయ్యా.. గుడివాడ అమర్ ను ట్రోల్ చేసిన cop pages కి ఇప్పుడు కళ్లలో ఏం పెట్టుకున్నారో… pic.twitter.com/9iDK27y1ls— రామ్ (@ysj_45) June 8, 2025