SI Chander (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

SI Chander: రాత్రివేళ కుటుంబంపై ఎస్సై దౌర్జన్యం

SI Chander: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మడలం రామారం గ్రామంలో ఎస్సై చందర్ రాత్రివేళ ఓ కుటుంబంపై జులుం ప్రదర్శించాడని పలువురు ఆరోపణలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలోబైక్ ఆపలేదని రామవరం గ్రామానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల కలిసి బైక్ పై వెల్తున్నారు. బాలకృష్ణా అనే వ్యక్తిని నడిరోడ్డుపై అడ్డగించాడు. బాలకృష్టా బైక్ ఆపకుండా మందుకు వెల్లడంతో ఆగ్రహించిన ఎస్సై చందర్ భార్యా, పిల్లల ముందే అతని చెంప చెళ్లుమనిపించాడు. అనంతరం బైక్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో రాత్రంతా కుటుంబం సభ్యులు రోడ్డుపై ఏడుస్తూ ఉండిపోయారు. దీంతో ఎస్సై చందర్ తీరు వివాదస్పదం కావడంతో పలువురు అతనిపై మండిపడుతున్నారు.

చీకటిలోనే వదిలేసిన పోలీసు

ఎస్సై చందర్ తీరుపై స్థానికులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ, చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కనీసం కనికరం లేకుండా చీకటిలో వదిలేసిన పోలీసు చర్యలను పలువురు నాయకులు ఖండిస్తున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. స్థానికంగా ఈ విషయం వివాదాస్పదంగా మారింది.

Also Read: Nara Lokesh: ప్రైవేటు రంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!

విచారణ చేపట్టాలని డిమాండ్

రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధపై నమ్మకంలేకుండా పోతుందని, రక్షక భటులు అంటు రక్షించేవారిలా ఉండాలి కానీ ఇలా రాత్రిసమయంలో పట్టుకొని హింసించే వారిలా ఉంటారా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమంయంలో ఆ కుటుంభానికి ఎదైన జరిగి ఉంటే వారి కుటుంభ పరిస్ధితి ఏంటని, గ్రామస్తులు ఎస్సై చందర్‌పై వెంటనే సస్పెన్షన్ విధించాలని, పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదని వెంటనే ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Sundar Pichai: లైఫ్‌లో సక్సెస్ కావాలా.. సుందర్ పిచాయ్ గురించి తెలుసుకోవాల్సిందే!

 

 

 

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు