RCB Karnataka High Court
Viral, లేటెస్ట్ న్యూస్

RCB Stampede: హైకోర్టుకు వెళ్లిన ఆర్సీబీ.. ఎందుకో తెలుసా?

RCB Stampede: గతవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2025 (IPL 2025) ట్రోఫీ గెలిచిన సందర్భంగా బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన విజయోత్సవం, సన్మాక కార్యక్రమం తీవ్ర విషాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఎం.చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది మృత్యువాత పడగా, 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, అభిమానుల భద్రతను గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఆర్సీబీ ఫ్రాంచైజీపై బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌తో పాటు కీలక వ్యక్తులు అరెస్ట్ కూడా అయ్యారు. అయితే, తమపై నమోదయిన కేసును కొట్టివేయాలంటూ ఆర్సీబీ ఫ్రాంచైజీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ (DNA Entertainment Networks Pvt Ltd) కూడా సంస్థపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఆర్సీబీ కారణమని అప్పుడే చెప్పలేం
ఐపీఎల్-2025 ట్రోఫీ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియానికి అభిమానులను ఆహ్వానిస్తూ ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన మూడు ట్వీట్లే తొక్కిసలాటకు కారణమయ్యాంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని యాజమాన్యం తప్పుబట్టింది. తమపై అక్రమంగా దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ వేసింది. దీనిని పరిశీలించిన కర్ణాటక హైకోర్టు, ఆర్సీబీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులే ఈ తొక్కిసలాటకు దారితీశాయా లేదా అనేది అప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటకు ఆర్సీబీదే బాధ్యత అనడం తొందరపాటు అవుతుందని జస్టిస్ కృష్ణ కుమార్ వ్యాఖ్యానించారు.

Read this- IAS Bribe Scandal: అడ్డంగా దొరికిన ఐఏఎస్.. ఇదేం పాడు పనయ్యా నీకు?

డీఎన్ఏ పిటిషన్‌లో ఏముంది?
పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని డీఎన్ఏ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారని, రద్దీని పోలీసులు సరిగా మేనేజ్ చేయలేకపోయారని నిందించింది. స్టేడియం వద్ద సరిపడ సంఖ్యలో అధికారులను మోహరించలేదని, ఎక్కువ మంది అధికారులను విధాన సౌధ వద్దే ఉంచారని, అందుకే స్టేడియం వద్ద పరిస్థితి అదుపు తప్పిందని ఆరోపించింది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇంతకంటే ఎక్కువ మంది అభిమానులు వచ్చినప్పుడు కూడా ముంబైలో తాము విజయోత్సవాన్ని నిర్వహించామని ప్రస్తావించింది. వాంఖడే స్టేడియం కెపాసిటీ కేవలం 32 వేలు మాత్రమే అయినా రద్దీని చక్కగా మేనేజ్ చేశామని సమర్థించుకుంది.

ఓపెన్ టాప్ బస్సుపై ఆర్సీబీ ఆటగాళ్ల ఊరేగింపునకు అనుమతి కోరుతూ పోలీసు అధికారులకు లేఖ రాశామని, కానీ, పోలీసులు తమ అభ్యర్థనను తిరస్కరించారని డీఎన్ఏ నిర్వాహకులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు అనుమతి ఇవ్వలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధ వద్ద ఈవెంట్‌ను నిర్వహించిందని, అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు, అధికారులను మోహరించారని వివరించింది. ఈ కారణంగానే స్టేడియం వద్ద తగినంత భద్రత లేదని డీఎన్ఏ సంస్థ ఆరోపించింది. విజయోత్సవం, ఆటగాళ్ల సన్మాన ఈవెంట్ల కోసం 584 మంది ప్రైవేట్ సిబ్బందిని నియమించినట్టు డీఎన్ఏ తెలిపింది. తమ సిబ్బంది, పోలీసులకు కలిపి మొత్తం 2,450 ఆహార ప్యాకెట్లను ఏర్పాటు చేశామని పిటిషన్‌లో ప్రస్తావించింది. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతంలో అందుబాటులో ఉన్న కేవలం 600 మంది పోలీసులకు మాత్రమే ఫుడ్ ప్యాకెట్స్ అందించామని వివరించింది.

Read this- Cricket Controversy: లార్డ్స్ మైదానంలో టీమిండియా.. ఆస్ట్రేలియా టీమ్‌కు బిగ్ షాక్

గేట్లు త్వరగా తెరవలేదు
సన్మాన కార్యక్రమానికి వేదికైన ఎం.చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలలో అభిమానుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ స్టేడియం గేట్లను ఓపెన్ చేయలేదని డీఎన్ఏ సంస్థ ఆరోపించింది. దుర్ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మాత్రమే గేట్లు తెరిచారని పేర్కొంది. అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారని, ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని వివరించింది. పోలీసులు లాఠీఛార్జీకి దిగడం అభిమానులను భయాందోళనలకు గురిచేసిందని, విషాదకర తొక్కిసలాటకు ఇదే కారణమైందని పిటిషన్‌లో డీఎన్ఏ నెట్‌వర్క్స్ వాదించింది. ప్రభుత్వ లోపాలు, తప్పుల నుంచి తప్పించుకునేందుకు అన్యాయంగా తమను టార్గెట్ చేశారని, రాజకీయ పరమైన ఆదేశాల ప్రకారం నడుచుకొని ఇద్దరు సిబ్బందిని అరెస్టు చేశారని ఆరోపించింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి అధికారిక ఆహ్వానం ప్రకారమే ఈ కార్యక్రమం జరిగిందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా సన్నాహాలను పర్యవేక్షించారని ప్రస్తావించింది.

సీఎం ఆదేశాల మేరకే నిఖిల్ అరెస్ట్
ఆర్సీబీ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మొత్తం నాలుగు పిటిషన్లు కర్ణాటక హైకోర్టులో దాఖలయ్యాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు తనను అరెస్ట్ చేశారని, తనకు ఉపశమనం కల్పించాలంటూ ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలే పిటిషన్ దాఖలు చేశారు. నిఖిల్ అరెస్ట్ విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ తీసుకున్నామని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించలేరని నిఖిల్ తరపు న్యాయవాది వాదించారు. కలగజేసుకున్న జస్టిస్ కృష్ణకుమార్, ముఖ్యమంత్రే అరెస్ట్ చేయమని చెప్పారా? అని ప్రశ్నించారు. అవును, పబ్లిక్‌గా మీడియా సమావేశంలోనే అన్నారంటూ న్యాయవాది స్పందించారు. కేసు దర్యాప్తు గురించి మీడియాతో మాట్లాడుతూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని జడ్జి వివరించారు. కాగా, సంబంధించిన పిటిషన్లు అన్నింటిపై కోర్టు విచారణ జరగాల్సి ఉంది.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?