Sajjala Will Arrest
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YSRCP: సజ్జలకు మూడినట్టేనా.. అరెస్ట్ తప్పదా?

YSRCP: అవును.. వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని (Sajjala Ramakrishna Reddy) అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇది స్వయంకృపరాధమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సాక్షి డిబేట్‌లో అమరావతిపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు నోటిదూలతో పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే.. సోమవారం ఉదయాన్నే సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును (Kommineni Srinivasa Rao) అరెస్ట్ చేసేదాకా వెళ్లింది. అలాంటప్పుడు వైసీపీ (YSRCP) అండ్ కో బ్యాచ్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మరీ మాట్లాడాలి. కానీ, సజ్జల మాత్రం మరింత రెచ్చిపోయి నోటికి పనిపెట్టారు. ఏ పదాలు అయితే ఆయన నోటి నుంచి రాకూడదో అవే వచ్చేశాయి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సజ్జలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా అరెస్ట్ తప్పదని పెద్ద ఎత్తునే హడావుడి నడుస్తున్నది. కొమ్మినేని తర్వాత సజ్జలకు మూడినట్టేనని, పక్కాగా అరెస్ట్ తప్పదని చిన్నపాటి లీకులు వస్తున్నాయి.

ఇంతకీ ఏమన్నారు?
అనంతపురం, సత్యసాయి జిల్లాలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ప్రభుత్వంలో కనీస స్పందన లేదని సోమవారం మీడియా ముందుకొచ్చి సజ్జల ప్రశ్నించారు. ఎందుకంటే మొత్తం పోలీస్ యంత్రాంగం కక్షసాధింపు కేసుల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కొమ్మినేని, కృష్ణంరాజు ఫొటోలను అసహ్యకరంగా ఫోటోలను చెప్పులతో కొట్టడం వంటి చర్యలను ఏమనాలి? అన్ని రకాలుగా రాక్షసత్వం, పిశాచి, సంకర తెగ మనస్తత్వం గల ప్రత్యేక తెగను సృష్టించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తెగను ఆర్గనైజ్‌డ్‌గా తయారు చేశారని.. వారితో ఈ దారుణాలు చేయిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ మూడు రోజుల పాటు సీఎం, పార్టీ యంత్రాంగం, అనుకూల మీడియాను ఒక జర్నలిస్ట్, విశ్లేషకులు, ఒక మాజీ సీఎం, ఒక రాజకీయ పార్టీపైన దుష్ప్రచారంకు కేటాయించారు. అరాచకత్వం, మాఫియాతత్వం, దానిలో దోపిడీని సాగించడం వారి లక్ష్యం. ఎవరు మాట్లాడినా ఇలా దాడి చేయడం. ఇవి మొత్తం మీడియాకు, జర్నలిస్ట్‌లకు ప్రమాద ఘంటికలు. ఎవరైనా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నా వారికి ముప్పు తప్పదు. చంద్రబాబును పొగిడితేనే వారికి సర్వైవల్ ఉంటుందనే సందేశం ఇస్తున్నారు. దీనిని ప్రజలు గ్రహించాలి. ఎవరు తమకు వ్యతిరేకంగా గొంతు ఎత్తినా సహించమనే బెదిరింపు ఉంది. దీనిపై ప్రజలు గొంతు విప్పి దీనిని ప్రశ్నించాలి’ అని సజ్జల డిమాండ్ చేశారు.

Read Also- IAS Bribe Scandal: అడ్డంగా దొరికిన ఐఏఎస్.. ఇదేం పాడు పనయ్యా నీకు?

ఇంత దారుణమా?
‘ సాక్షి టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని అరెస్ట్‌. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయి. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. ఇటువంటి దిగజారుడు రాజకీయాలతో రాష్ట్రంను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు పాలనపై పౌరసమాజం, పాత్రికేయలోకం, మేధావులు స్పందించాలి. నాలుగు దశాబ్ధాలు జర్నలిజంలో అనుభవం ఉన్న కొమ్మినేని సాక్షి టీవీలో డిబేట్ షో నిర్వహిస్తున్నారు. ఆ డిబేట్‌లో మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు విశ్లేషకుడుగా పాల్గొని రాష్ట్రంలో సెక్స్‌ వర్కర్ల గురించి ఇతర మీడియాల్లో ప్రచురితమైన కథనాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతి చుట్టుపక్కల వీరి సంఖ్య ఎక్కువగా ఉందని వచ్చిన కథనంను ఉటంకించారు. దానిని ఒక ప్రణాళిక ప్రకారం వివాదం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ, కృష్ణంరాజు ఏకంగా వేశ్యల రాజధాని అని మాట్లాడటం ద్వారా అమరావతి గురించి తప్పుగా వ్యాఖ్యలు చేశారనే ప్రచారాన్ని ప్రారంభించింది. టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో మూడు రోజుల నుంచి ప్రముఖంగా ఇదే అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. దీని కొనసాగింపుగా చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తన ట్వీట్‌లో కృష్ణంరాజు వీడియోను పోస్ట్ చేశారు. టీడీపీ, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థలు, టీడీపీకి సంబంధించిన దాదాపు రెండువందలకు పైగా యూట్యూబ్ చానెల్స్, టీడీపీ అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు మూడు రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం దీనిపై దుష్ప్రచారం మొదలు పెట్టాయి’ అని సజ్జల మండిపడ్డారు.

Read Also- YS Jagan: అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌!

ఇవ్వన్నీ ఆర్గనైజ్డ్‌ ఆందోళనలే..
‘ ఇది కృత్రిమంగా చేస్తున్న ఆర్గనైజెడ్‌ ఆందోళనలే. టీడీపీ వారు కొద్దిమందిని పోగేసి, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆర్గనైజ్ చేసి, అధికారంలో ఉన్నామని తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి దీనిని వాడుకుంటున్నారు. దీనిపై చంద్రబాబు వీడియో పెట్టి స్టేట్‌మెంట్, తర్వాత పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్, ట్వీట్ పెట్టారు. అమరావతి పేరును ఉచ్చరించాలంటేనే అందరూ భయపడాలి, మొత్తం రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది దీనిపై స్పందిస్తారనే ఇంప్రెషన్ ఇచ్చేందుకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆందోళనలు చేయించారు. ఇవి సహజంగా జరుగుతున్నవి కావు. అమరావతి పరువును మీరు తీస్తున్నారా? కృష్ణంరాజు, కొమ్మినేని తీశారా? రాష్ట్రంలో మహిళల పరువును ఎవరు తీస్తున్నారు? రాష్ట్రంలో సెక్స్‌ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనంను డిబేట్‌లో ఉటంకించారు. రాష్ట్రంలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారంటే దాని అర్థం రాష్ట్రంలోని మహిళలను అవమానించడమా? కొన్ని నిర్ధిష్టమైన ప్రాంతాల్లో ఎక్కువమంది ఉన్నారంటే, ఆ ప్రాంతంలోని మహిళలను అవమానించినట్లా? అయినా కూడా మేం బాధపడ్డామని కొందరు బయటకు రావడతో ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా దానిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించడం సమంజసమా? ఇదంతా చంద్రబాబు కావాలని చేస్తున్నారు. కోల్డ్‌బ్లడెట్‌గా ఆయనకు తెలిసిన విద్యను అమలు చేస్తున్నారు. ప్రజల మెదళ్ళో విషాన్ని నింపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కొమ్మినేని కేవలం సమస్యలపై ఆవేశంగా మాట్లాడతారే తప్ప, ఎక్కడా కూడా సంయమనం కోల్పోయి మాట్లాడరు. టీడీపీకి వంతపాడే టీడీ ఛానెల్స్‌లో డిబేట్లు నిర్వహించే వారికి భిన్నంగా ఆయన చాలా హుందాగా నిర్వహిస్తున్నారు. టీడీపీకి పోయేకాలం దాపురించబట్టే ఇలా చేస్తున్నారు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

Read Also- Andhra Pradesh: ఏపీలో రోజురోజుకూ గాడి తప్పుతున్న లా అండ్ ఆర్డర్.. ఎందుకిలా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?