Mumbra train Incident
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Mumbra Train Incident: రైలు లోనుంచి పడిపోయిన ప్యాసింజర్లు.. ఐదుగురి మృతి

Mumbai Train Incident: మరో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. మహారాష్ట్రలో థానే సమీపంలోని ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద (Mumbra Train Incident) సోమవారం వేగంగా దూసుకెళుతున్న ఓ లోకల్ ట్రైన్ నుంచి పలువురు ప్యాసింజర్లు పట్టాలపై పడిపోయారు. విపరీతమైన రద్దీ కారణంగా బ్యాలెన్స్ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ప్యాసింజర్లు చనిపోయారు.  10 మందికి పైగా గాయపడ్డారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వైపు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిదింది.

10 నుంచి 12 మంది ప్రయాణికులు బ్యాలెన్స్ కోల్పోయి పట్టాలపై పడిపోయినట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. రైలులో తీవ్రమైన రద్దీ ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్యాసింజర్లు డోర్లపై వేలాడుతూ ప్రయాణించారని, ఈ కారణంగానే బ్యాలెన్స్ తప్పి పడిపోయి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బాధితులను అత్యవసర వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read this- Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్

ఈ ఘటనపై సెంట్రల్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ ధన్ రాజ్ నీలా మాట్లాడారు. ప్రమాదం జరిగినట్టుగా సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్నామని, బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని వివరించారు. కదులుతున్న రైలు నుంచి ప్యాసింజర్లు కింద పడ్డారని చెప్పారు. రద్దీలో ప్యాసింజర్లు ఒకరినొకరు ఢీకొట్టుకొనడంతో కిందపడిపోయారని వివరించారు. మరోవైపు, ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు రూట్‌ను క్లియర్ చేయడంతో రైలు సర్వీసులకు మార్గం సుగుమం అయ్యింది.

Read this- Jr NTR: ఆ ఇద్దరి కూతుళ్ళకు ఎన్టీఆరే పెళ్లి చేశాడని చెప్పిన నటుడు అశోక్ కుమార్

13 మంది కిందపడ్డారు
దాదాపు 13 మంది ప్యాసింజర్లు రైల్లోంచి పడ్డారని థానే జిల్లా అధికారులు వెల్లడించారు. ఐదుగురు చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గాయపడినవారిని దగ్గరిలోని జుపీటర్ అనే ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. పలువురికి ప్రాణాపాయం తప్పిందన్నారు. మరికొందరు బాధితులు కల్వా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు వివరించారు. బాధిత ప్యాసింజర్లు ఫుట్‌పాత్‌పై ప్రయాణించినట్టు తెలుస్తోందని జిల్లా అధికారులు పేర్కొన్నారు.

మహారాష్ట్ర సీఎం స్పందన
ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ వేదికగా స్పందించారు. దివా, ముంబ్రా స్టేషన్ల మధ్య లోకల్ ట్రైన్ నుంచి కొంతమంది ప్యాసింజర్లు కిందపడి మృతి చెందడం చాలా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళులు తెలియజేస్తున్నానని, ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని తక్షణమే శివాజీ హాస్పిటల్, థానే సివిల్ హాస్పిటల్‌లో చేర్చించినట్టు వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తు్న్నట్టు చెప్పారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?