bhadradri kothagudem: ఆ ఆదివాసి మహిళ నిండు చూలాలు. శిశువుకు జన్మనిచ్చేందుకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వారు ఉంటున్న కాలనీలో అంతంత మాత్రమే వైద్యం అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో ఓవైపు పురిటి నొప్పుల బాధను పంటికింద ఉంచుకుంటూ… మరోవైపు ప్రసవం కోసం ఎక్కడికి వెళ్లాలో… తెలియని వేదన. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం చేగర్శల గ్రామాల సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఉమేష్ చంద్ర నగర్ లో చోటు చేసుకుంది.
ప్రసవ వేదన అనుభవిస్తున్న జానకి
వివరాల్లోకి వెళితే… గత పదేళ్ల క్రితం చత్తీస్గడ్ ప్రాంతానికి చెందిన కొన్ని ఆదివాసి కుటుంబాలు ఉమేష్ చంద్ర నగర్లో జీవనోపాధి కోసం వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా ఉమేష్ చంద్ర నగర్ లో ఉంటున్న మిడియం సంగమయ్య… జానకి దంపతులకు మొదటి సంతానం అందింది. 9 నెలల పాటు కడుపులో పెరుగుతున్న శిశువుకు నిండు చూలాలు వచ్చాయి. ప్రసవ వేదన అనుభవిస్తున్న జానకిని ఆదివాసీలు మంచంలో పడుకోబెట్టి (డోలి) సహాయంతో సమీప చేయగల ప్రాంతం లో ఉన్న ప్రధాన రహదారి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి 108 లో భద్రాచలం లోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ జానకికి వైద్యులు ప్రసవం చేయించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
Also Read: TG Cabinet Expansion: ఎవరికి ఏ శాఖో..? సీఎం వద్ద కీలక శాఖలు!
ఆదివాసి గ్రామాల్లో నిత్య కృత్యంగా కనిపించే దృశ్యం
ఆదివాసి గ్రామాల్లో నిత్య కృత్యంగా ఇలాంటి జడ్డి (డోలి) దృశ్యాలు తరచు కనిపిస్తూనే ఉంటాయి. అమాయక ఆదివాసి ప్రజల ఓట్లతో గెలిచే ప్రజాప్రతినిధులు వారిని మర్చిపోవడం ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది. నిత్యం ఆదివాసీలు అటవీ ఉత్పత్తులు మీదనే ఆధారపడుతూ, అదేవిధంగా సమీప గ్రామాల రైతుల వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ జీవనోపాధిని సాగిస్తూ ఉంటారు. అలా ఏళ్ల తరబడి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటారు.
తీవ్ర నిర్లక్ష్యం
ఎండకు, వానకు, చలికి ఓర్చుకుంటూ తమ కుటుంబాలను వెల్లదీస్తూ వస్తున్నారు. అయితే వారి ఓట్ల ద్వారా గెలిచిన ప్రజాప్రతినిధులు మాత్రం వారిని పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆదివాసీలు అడప దడప అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి గోడు వెల్లబోసుకున్నప్పటికీ వారిని పట్టించుకోకపోవడం ప్రజా ప్రతినిధులు, అధికారుల వంతవుతుంది.
Also Read: Errolla Srinivas: నీటి ప్రయోజనాలు రేవంత్‌కు పట్టవా?.. బీఆర్ఎస్ నేత ఫైర్!