Savitha Minister
ఆంధ్రప్రదేశ్

Savitha: మంత్రి సవితకు ఏమైంది.. ఈ వీడియోలో నిజమెంత?

Savitha: అసలే సోషల్ మీడియా (Social Media) కాలం.. చీమ చిటుక్కుమన్నా సరే నెట్టింట్లో న్యూస్, వీడియోలు, ఫొటోలు ప్రత్యక్షం అయిపోతాయి. అందులో నిజమెంత..? అబద్ధమెంత..? అనేది పక్కనపెడితే ఒక్కసారి వైరల్ అవ్వడం మొదలుపెడితే ఇక నాన్ స్టాప్‌గా నలుగురిలో నానుతూనే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఏమైనా చిన్నపాటి తప్పు చేసినా, నోరు జారినా అంతే సంగతులు. ఇప్పటి వరకూ ఎన్ని సంఘటనలు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savitha) వంతు వచ్చింది. శనివారం ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన సవిత.. ఓ అధికారి అందించిన పూల బొకేను కోపంతో ఊగిపోతూ వెనక్కి విసిరికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. దీనిపై నెటిజన్లు, ప్రత్యర్థులు, విమర్శకులు ఎవరికి తోచినట్లు వాళ్లు స్పందిస్తున్నారు.

Read Also- Kannappa: మళ్లీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మంచు ఫ్యామిలీ.. ఈసారి ఏమవుతుందో?

ఎందుకనీ..?
పూర్తి వివరాల్లోకెళితే.. జూన్ 1న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని సీఎస్‌డీటీ (కాలేజ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ)లో నిత్యావసర సరుకుల పంపిణీ, రేషన్ షాపుల పునఃప్రారంభంపై చర్చించడానికి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెనుగొండ తహశీల్దార్ శ్రీధర్ స్వాగతం పలుకుతూ ఇచ్చిన బొకేను వెనక్కి విసిరేశారు. మంత్రి ఎంత అసహనంతో ఉంటే ఆ బొకేను అంతలా వెనక్కి విసిరారు అనేది వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు.. ఆ బొకే అక్కడే ఉన్న మంత్రి గన్‌మన్‌కు తగిలి కిందపడిపోయినట్లుగా వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ చేతన్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. మంత్రి ఎందుకిలా అసహనంగా ఉన్నారు? సదరు తహశీల్దార్‌కు మంత్రికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇద్దరికీ పడట్లేదా? అసలు ఈ వీడియోలో నిజమెంత ఉంది? అప్పుడెప్పుడో వారం కిందట ఇది జరిగితే ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నది..? ఈ వీడియో ఎడిట్ చేశారా? లేకుంటే ఒరిజనలా? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

Savitha Minister

ఇందుకేనా..?
సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తుండగా.. వైసీపీ కూడా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యింది. ‘ టీడీపీ మంత్రి సవిత అహంకారం. మర్యాదపూర్వకంగా పెనుకొండ తహశీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బోకేను, అహంకారంగా మంత్రి విసిరేశారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో సహచర అధికారితో మంత్రి దురుసు ప్రవర్తన చూసి అధికారులు నొచ్చుకున్నారు. మీ తప్పుడు పనులకు సహకరించలేదని అధికారులపై కక్ష సాధిస్తున్నారా మేడమ్?’ అంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ ట్యాగ్ చేసింది. బొకేను అలా విసిరి పారేయడంపై ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. సవిత ఇలా దురుసుగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. గతేడాది నవంబర్‌లో జరిగిన శాసన మండలిలో సవిత మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఈ వివాదం సద్దుమణగక మునుపే ఇలా ‘బొకే’తో సవిత బుక్కయ్యారు.

Savitha Bouquet issue

అబ్బే.. అదంతా ఫేక్!
మంత్రి సవిత ఫ్లవర్ బొకే విసిరిన ఘటనపై పెనుగొండ తహశీల్దార్ శ్రీధర్ వివరణ ఇచ్చారు. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ‘ఎడిట్’ చేసినదని వీడియో రిలీజ్ చేశారు. బొకే తీసుకొని వెనక్కి ఇస్తున్న సందర్భంలో సెక్యూరిటీ చేతి నుంచి జారి కింద పడిందన్నారు. అంతే కానీ ఎక్కడా బొక్కే విసిరిన సందర్భం లేదని తెలిపారు. ‘ మంత్రి వర్యులు ఎక్కడా ఉద్యోగస్తులతో దురుసుగా ప్రవర్తించలేదు. అది ఎడిటెడ్ వీడియో.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం. మంత్రి సవిత.. అధికారుల పట్ల ఎంతో సౌమ్యంగా ఉంటారు’ అని శ్రీధర్ వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు.. ఎవరైనా బొకే విసిరికొడితే అంత వేగంగా వెనక్కి వెళ్తుందా? ఇదేం సినిమా కాదు కదా? పక్కాగా ఇదంతా ఎడిట్ చేసిన వీడియోనే అని నెటిజన్లు, టీడీపీ కార్యకర్తలు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ నిజం చెప్పాలంటే సవితమ్మ చాలా మర్యాదస్తురాలు. ఇంటి దగ్గరికి ఎవరైనా సమస్య ఉందని వస్తే వాళ్లను రిసీవ్ చేసుకునే తీరు చాలా ముచ్చటేస్తుంది. నేను పలుమార్లు పలు సమస్యలు తీసుకెళ్లినప్పుడు ఆమె చూపిన చొరవ నిజంగా చాలా అభినందనీయం. కానీ ఇలా ప్రవర్తించారంటే బలమైన కారణం ఉండే ఉంటుంది’ అని సవిత అభిమానులు చెప్పుకుంటున్నారు.

Read Also- Jogi Ramesh: వైసీపీకి జోగి గుడ్ బై.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..