Jogi Ramesh
Politics

Jogi Ramesh: వైసీపీకి జోగి గుడ్ బై.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే!

Jogi Ramesh: అవును.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని రీతిలో ఎక్కడలేని చిత్ర విచిత్రాలన్నీ వైసీపీలోనే (YSR Congress) చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు పార్టీకి గుడ్ బై చెబుతారో..? ఎవరు ఏ నిమిషంలో కండువా మారుస్తారో..? నమ్మకస్తులు, రైట్ హ్యాండ్‌లు, ముఖ్యనేతలు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని హైకమాండ్‌, ఆ పార్టీ కార్యకర్తలు సందేహిస్తున్నారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి కుటుంబం చిక్కుల్లో పడింది. ఆ తర్వాత టీడీపీ (TDP) నేతలతో కలిసి ఓసారి వేదికను పంచుకోవడంతో పెద్ద వివాదమే నెలకొన్నది. ఇప్పుడు ఏకంగా టీడీపీకి మద్దతుగా.. రేపో మాపో వైసీపీ కండువా పక్కన పడేసి.. టీడీపీ జెండా కప్పుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు? ఎందుకిలా టీడీపీకి మద్దతుగా మాట్లాడారు? ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’కి చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

Read Also- TDP: టీడీపీకి ఊహించని ఝలక్.. అవాక్కైన అధిష్టానం.. కీలక నేత రాజీనామా వెనుక!

ఇదీ అసలు సంగతి..
శనివారం నాడు ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’కి జోగి రమేష్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు, అమరాతి సింగిల్ రాజధానిపై ఈ రెండు విషయాలపైన స్పందించారు. ‘ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై (Nara Bhuvaneswari) కామెంట్స్‌ విషయంలో నా భార్య కూడా నన్ను నిలదీసింది. అసెంబ్లీకి వెళ్లేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడేందుకేనా? చంద్రబాబు (Chandrababu) సతీమణిపై అలా మాట్లాడొచ్చా? అని మమ్మల్ని అడిగారు. ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పే’ అని జోగి రమేష్ అంగీకరించారు. అంతేకాదు.. ఇది కూడా వైసీపీ ఘోర పరాజయానికి కారణమని వెల్లడించారు. ఆ తర్వాత.. అమరావతిపైనా జోగి సంచలన కామెంట్స్ కామెంట్స్ చేశారు. ‘ ఇక నుంచి అమరావతే (Amaravati) సింగిల్ రాజధాని. 3 రాజధానుల (3 Capitals) వల్ల వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చిన తర్వాత మేం మూడు రాజధానుల జోలికి వెళ్లం.. ఆ ప్రయత్నాలు కూడా చేసేది లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణం ఉంటుంది. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు తప్పు’ అని జోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అంతా అయిపోయినట్టే.. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే తరువాయి అంటూ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ‘రెడ్ బుక్ దెబ్బ.. జోగి అబ్బా’ అంటూ టీడీపీ శ్రేణులు సైతం కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.

Jogi Ramesh
Jogi Ramesh

ఈ మాటల వెనుక..?
జోగి రమేష్ చేసిన కామెంట్స్‌లో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఆయన ఏం మాట్లాడాలి అనుకున్నారు? ఎదేదో ఎందుకు వాగుతున్నారు? అంటూ ఇంటర్వ్యూ చేసిన వైసీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఈ మాటల వెనుక మర్మమేంటి? వైసీపీకి గుడ్ బై చెప్పడానికే ఇలా టీడీపీని కాకా పడుతున్నారా? లేదంటే పార్టీనే జోగితో ఇలా చెప్పించిందా? అయినా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదా? అనే ప్రశ్నలు అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్నాయి. మరికొందరేమో.. వైసీపీలో ఉండే ప్రసక్తే లేదని ఈ కామెంట్స్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చారని పార్టీలో, అనుచరుల్లో చర్చ జరుగుతోంది. ‘ జోగి రమేష్.. అమరావతి గురించి మాట్లాడిన దానికి వైసీపీకి సంబంధం లేదు. అది ఆయన సొంత అభిప్రాయం. రెడ్‌బుక్ కేసులకు భయపడి ఇలా అమరావతి భజన చేసి ఉండొచ్చు. ఆయన పార్టీ మారినా అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు’ అన్నట్లుగా వైసీపీ అభిమానులు చెప్పుకుంటున్నారు. జోగి వ్యవహారంపై వైసీపీ ఎలా స్పందిస్తుంది? అసలు స్పందిస్తుందా.. లేదా? లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా? అనేదానిపై అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

Jogi Ramesh

Read Also- Amaravati: అమరావతి ‘వేశ్యల’ రాజధాని అయితే.. వైఎస్ జగన్ ఎక్కడ?

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు