Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న రాజధాని నగరం అమరావతి. దీనికి సుదీర్ఘమైన, గొప్ప చరిత్ర ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు వంటి చారిత్రక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. అమరావతిలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ స్తూపం ఉంది, ఇది బౌద్ధ మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. ఇది ఒకప్పుడు ధాన్యకటకం పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలున్నాయి. గతంలో రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి రాజకీయ వివాదాలు తలెత్తాయి. కానీ ఇంత మహోత్తరమైన చరిత్ర కలిగిన అమరావతిని ‘వేశ్యల రాజధాని’ అని వైసీపీకి చెందిన ‘సాక్షి’ డిబెట్‌లో విశ్లేషకుడు, పార్టీ అనుకూల వ్యక్తి జర్నలిస్ట్ కృష్ణంరాజు (Journalist Krishnam Raju) మాట్లాడటం సిగ్గుచేటు. దీంతో అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి నీచంగా మాట్లాడిన వైసీపీ అనుకూల జర్నలిస్టు, ఆయనతో అలా మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాసరావులపై (Kommineni Srinivasarao) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో మహిళలు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహం కట్టలు తెంచుకోగా.. కృష్ణంరాజు, కొమ్మినేని చిత్రపటాలను చెప్పులతో కొట్టి తమ ఆగ్రహం వెలిబుచ్చారు. అమరావతిని, మహిళలను దారుణంగా అవమానించిన ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also- Non Veg: చికెన్, మటన్, ఫిష్ .. వీటిలో ఏది మంచిది? షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు
ఆ బిల్డింగ్ ఎక్కడుంది?
సాక్షిలో.. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పించారు సరే.. తాడేపల్లి ప్యాలెస్, అందులో ఉన్న వైఎస్ జగన్ (YS Jagan) ఏ ప్రాంతంలో ఉన్నారు? ఆ బిల్డింగ్ ఎక్కడుంది? అనేది కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని మాజీ పోలీసు అధికారి ఏబీవీ లాంటి వారు మండిపడుతున్నారు. జగన్ పెంచి పోషిస్తున్న వైసీపీ బ్యాచ్‌కి అమరావతి మీద ద్వేషం ఇంకా తగ్గలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల పట్ల నీచ భావం కూడా అదే స్థాయిలో ఉందని జనాలు మండిపడుతున్నారు. ఈ రెండు మానసిక రుగ్మతలతో వచ్చే మాటలు ఇలాగే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. విషయం ఏమిటంటే వైఎస్ జగన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి (YS Bharathi) సాక్షి మీడియాలో ఇలాంటి చర్చ చోటుచేసుకోవడం గమనార్హం. ‘ జగన్ రోజూ అన్నం బదులు విషం మింగుతున్నట్టు ఉంది. అందుకే ఇలాంటి విష పురుగులతో విష ప్రచారాలు చేయిస్తున్నాడు. అది ఒక అమరావతి వరకు అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ అవమానించే స్థాయికి దిగజారాడు. ఇలాంటి వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టి లోపల వేసి అప్పుడు చెప్పండి సార్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమరావతి మహిళలను చిత్ర హింసలు పెట్టాడు. ఇప్పుడు మీరు ఉంది కూడా వాళ్ళు ఇంత ధైర్యంగా ఆడవాళ్ళని ఇంత అసహ్యంగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్..? మీరు ఏమీ చెయ్యరని వాళ్ళ ధైర్యం’ అని నెటిజన్లు, టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
Read Also- Vijayabhanu: నిన్నటి మేటి నటీమణి విజయభాను ఇకలేరు
ఇంత దారుణమా..?
ఈ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రంగా స్పందించారు. ‘ మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. వైఎస్ జగన్.. మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో (Sakshi) అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుంది. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది? మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పదేపదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించం. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుంది’ అని లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఫిర్యాదుల పర్వం.. క్షమాపణ
రాజధానిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. అమరావతి మీద సాక్షి ఛానల్‌లో అపహాస్య , అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో స్పీకర్ పేర్కొన్నారు. అమరావతి వేశ్యల రాజధాని అన్న ఆరోపణలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు అని వ్యాఖ్యానించారు. క్రిష్ణం రాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి టీవీలో ఈ తరహా తీవ్ర విమర్శలు- మానవతా విలువలు, జర్నలిజం ప్రమాణాలు తిలోదకాలు ఇవ్వటమే అవుతుందన్నారు. ఐపీసీ సెక్షన్లు 294, 354 ఏ, 500, 504, 505(2), 509 ప్రకారం చర్యలు కోరుతూ.. టెలికాస్ట్ ఫుటేజ్ ఆధారంగా ఛానెల్ పైన, యాంకర్‌తో పాటు ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పైన పైన చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు. అయితే దీనిపై వీవీఆర్ కృష్ణంరాజు సామజిక సమస్యను రాజకీయానికి ముడిపెడితే రాష్ట్రానికే నష్టం అంటూ సాక్షి డిబేట్‌పై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సాక్షి కేఎస్ఆర్ క్షమాపణలు చెప్పారు. రాజధాని అమరావతి మహిళలను అవమానించే విధంగా సాక్షి డిబేట్‌లో (Sakshi Debate) మాట్లాడడంపై రైతులు తప్పుబట్టారు. జర్నలిస్టుగా ఉంటూ మహిళలపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ నిలదీశారు. దీంతో రైతులకు కొమ్మినేని క్షమాపణలు చెప్పారు. మరోవైపు.. టీడీపీ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ అమరావతి ప్రజలారా.. చంద్రబాబుని నమ్మొద్దు. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా.. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు.
Read Also- TDP: టీడీపీకి ఊహించని ఝలక్.. అవాక్కైన అధిష్టానం.. కీలక నేత రాజీనామా వెనుక!
— ABV (@abvrao) June 7, 2025