Watch Video (Image Source: AI)
జాతీయం

Watch Video: ఆహా.. ఇది కదా అసలైన బర్త్‌డే మజా.. మీరూ చూడండి!

Watch Video: మనిషి జీవితంలో పుట్టినరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున ఎంతో సరదాగా గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులకు పుట్టిన రోజు వచ్చిందంటే అదో పండగే అని చెప్పవచ్చు. కేక్ కటింగ్, బంధువులు ఇచ్చే గిఫ్ట్స్ తో ఆ రోజంతా వారు సరదాగా గడుపుతారు. అయితే ఎప్పుడు రొటిన్ గా సాగే ఈ ప్రొసెస్ ను.. తమ బిడ్డకు వద్దని అనుకున్నారు ఓ జంట. ఈసారి పుట్టిన రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించారు. ఈ క్రమంలో వారు చేసిన పని జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ వారు ఏం చేశారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

జమ్ముకశ్మీర్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అంజి ఖాద్ బ్రిడ్జిని ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ క్రమంలోనే ఆ వంతెన మీదుగా తొలిసారి వందేభారత్ రైలు (Vande Bharat train) పరుగులు పెట్టింది. కాశ్మీర్ లో మెుదలైన తొలి వందే భారత్ సర్వీస్ ఇదే కావడం గమనార్హం. అయితే వారణాసికి చెందిన రాకేష్ (Rakesh), నేహా జైస్వాల్ (Neha Jaiswal) దంపతులు తమ బిడ్డకు ఈ రైలులో పుట్టిన రోజు వేడుకలు జరిపి అందరి దృష్టిని ఆకర్షించారు.

రాజస్థాన్ లోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ మీదుగా బారాముల్లా వరకూ వందేభారత్ రైలు సర్వీసు (272 కి.మీ. దూరం)ను రైల్వే శాఖ కొత్తగా తీసుకొచ్చింది. ఈ వందేభారత్ సర్వీసు సైతం ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అద్భుత రోజునే తమ బిడ్డ మోక్ష్ పుట్టిన రోజు ఉండటం యాదృచ్చికమేనని బాలుడి తండ్రి రాకేష్ జైస్వాల్ తెలిపారు. కాశ్మీర్ నుంచి వందేభారత్ తొలి ప్రయాణంలోనే తమ బిడ్డ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించాలని భావించినట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా రైలులో కేక్ కట్ చేసి తమ బిడ్డకు ఎప్పటికీ గుర్తుండిపోయే మెమోరీని అందించాలని బాలుడి తండ్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

Also Read: Lizards: వామ్మో.. ఈ వ్యక్తి ఒంటి నిండా బల్లులే.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!