Siddipet District: సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్ పేట మండలం చౌదర్పల్లి గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న, అసైన్డ్ భూముల ఆక్రమణల పై విచారణ జరపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ఎస్సీఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. అసైన్డ్ భూముల అక్రమణల పై స్వేచ్ఛ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ను సుమొటగా స్వీకరించి జిల్లా కలెక్టర్‌ను విచారణ చేయాలని ఆదేశించారు. భూముల ఆక్రమణల పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి 15 రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ పేదల బతుకు దెరువు కోసం మాత్రమే ప్రభుత్వాలు అసైన్డ్ భూములు పంపిణీ చేశాయన్నారు. పెద్దల చెతుల్లోకి వెళ్ళిన భూములను స్వాధీనం చెసుకొని తిరిగిఅర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్నారు. ఎస్సీఎస్టీ లకు ఎక్కడ అన్యాయం జరిగిన కమీషన్ చూస్తూ ఊరుకోబోదని బక్కి వెంకటయ్య తెలిపారు.
రైతులు ఆవేదన
మాకు న్యాయం చేయమని ఎంపీ రఘునందన్ రావు వద్దకు వెళితే న్యాయం చేస్తానని చెప్పిండు. ఆ భూముల జోలికి వచ్చినోళ్ళని చీపుర్లు చెప్పులు మెడలో వేసి కొట్టాలని చెప్పిన వ్యక్తి మాకు అన్యాయం చేశారని బాధిత చౌదర్ పల్లి మహిళా రైతులు గతంలో కన్నీటి పర్యంతమయ్యారు. దుబ్బాక నియోజక వర్గం చౌదర్పల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి 294 సర్వే నెంబర్ లోని 84 ఎకరాలు మా భర్తలకు తాగించి తినిపించి లీజ్‌కు రాయించుకున్నారని గతంలో మహిళలు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. అయితే భూములను లీజు పేరిట రాసుకుంటే తమకు కొంత డబ్బు ఇస్తే తాము సంతకాలు పెట్టామని, రైతులు తెలిపారు. తమ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలువదని రైతులు గతంలో ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Helicopter on Road: నడిరోడ్డుపై హెలికాప్టర్ ల్యాండింగ్.. నుజ్జునుజ్జైన కారు
ప్రభుత్వ అసైన్మెంట్ భూములు
గతంలో తహసిల్దార్ వద్దకు తిరిగి తిరిగి చెప్పులు అరిగినవి కాని, ప్రభుత్వ అసైన్మెంట్ భూములు ఇవి పట్ట కావని చెప్పిన తాసిల్దారు ఎంపీ కుటుంబ సభ్యులపై ఎలా మార్చారని చౌదర్పల్లి గ్రామానికి చెందిన కొంత మంది మహిళ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా మొగుళ్ళుకు తాగిపించి, తినిపించి, మాభూములను లీజుకు రాయించుకున్నారని వారు తెలిపారు. మాకు భూములు రిజిస్ట్రేషన్ అయిన విషయం తెలువదని, మా భూములు మాకు ఇప్పించండి సారు అంటూ గతంలో వేడున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: Aadi Srinivas: ఈటెల రాజేందర్ పై ఆది శ్రీనివాస్.. సంచలన కామెంట్స్!