Aadi Srinivas: కాళేశ్వరం విచారణలో ఈటెల రాజేందర్ యొక్క తీరు మనిషి బీజేపీ, మనసు BRS అన్నట్లు అనిపించించిందని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిఎల్పీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకత్వం ఈటెల రాజేందర్ కమిషన్ ముందు అన్ని నిజాలు చెబుతారని అన్నారు. కానీ కాళేశ్వరం ATM గా మారిందని ఈటెల రాజేందర్ మాట మార్చి మాట్లాడారని అన్నారు. ఈటెల రాజేందర్ యొక్క పాత బాస్ కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు BRS ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. లేదంటే బీజేపీ అగ్రనాయకత్వమే కావాలని ఈటెలతో ఇలా చెప్పించారా అనేది చెప్పాలని ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ద్వారా 10.5 శాతం వడ్డీలకు రుణాలు తీసుకున్నారు.
Also Read: Rythu Bharosa: రైతులకు రైతు భరోసా.. వ్యవసాయ శాఖ మంత్రి కీలక వాఖ్యలు!
బీజేపీలో BRS పార్టీ విలీనం
ఆ నాడు కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఈటెల రాజేందర్ ఇప్పుడు క్యాబినెట్ తీసుకునే నిర్ణయం ప్రాకారం అంటున్నారని అన్నారు. 63వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు చేరిందని అన్నారు. ఆ నాడు రైతుల కోరిక మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చామని, ఈటెలచెప్పారు. మరి ఆ రైతులు ఎవరో ఈటెల రాజేందర్ ప్రజలకు చెప్పాలని ఆది శ్రీనివాస్ అన్నారు. బీజేపీలో BRS పార్టీ విలీనం కావడానికి ప్రయత్నం జరిగిందని కవిత లేఖలో చెప్పారు. దీంతో ఇప్పుడు అది తేట తెల్లం అయ్యిందని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అని మోదీ, అమిత్ షా చెప్పారు. కానీ BRS నీ కాపాడేందుకు బీజేపీ యూటర్న్ తీసుకుంటుందని అన్నారు. బీజేపీ, BRS ఒక్కటే అని ఆ నాడు కాంగ్రెస్ చెప్పిందని ప్రస్థుతం ఇప్పుడు అది రుజువైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
Also Read: Bullet Train India: బుల్లెట్ ట్రైన్‌తో అంత ఈజీ కాదు.. ఎన్నో వింతలు.. మరెన్నో విశేషాలు!