Bullet Train India (Image Source: AI)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Bullet Train India: బుల్లెట్ ట్రైన్‌తో అంత ఈజీ కాదు.. ఎన్నో వింతలు.. మరెన్నో విశేషాలు!

Bullet Train India: దేశంలో ముంబయి – అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad) మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జపాన్ కు చెందిన బుల్లెట్ ట్రైన్ సాంకేతికను అందిపుచ్చుకొని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. అయితే తాజాగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనుల పురోగతి గురించి NHSRCL కీలక ప్రకటన చేసింది. దీంతో బుల్లెట్ ట్రైన్ అంశం మరోమారు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ భారత్ లో రూపొందుతున్న ఈ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటీ? ఏ ఏ ప్రాంతాల మీదగా అది ప్రయాణించనుంది? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.


బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే దూరం
ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. 508 కి.మీ మేర విస్తరించి ఉంది. గుజరాజ్ లో 351 కి.మీ, మహారాష్ట్రలో 156 కి.మీ, దాద్రా నగర్ హవేలీలో 2 కి.మీ మేర ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది. మెుత్తం 12 స్టేషన్ల పరిధిలో ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ముంబయి, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్ల గుండా ఇది ప్రయాణించనుంది. గంటకు 320 కి.మీ వేగంతో రైలు పరుగులు పెట్టేందుకు వీలుగు అధునాతన ట్రాక్ లను NHSRCL నిర్మిస్తోంది.

నిర్మాణ విశేషాలు
ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పరిధి 508 కి.మీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో 465 కి.మీ వయాడక్ట్‌పై 10 కి.మీ, వంతెనలపై 21 కి.మీ, భూగర్భంలో (7 కి.మీ సముద్రం కింద), 5 కి.మీ పర్వత టన్నెల్స్ గుండా ఇది ప్రయాణించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. థానే క్రీక్ వద్ద 7 కి.మీ సముద్ర టన్నెల్ ను నిర్మించబోతున్నారు. సముద్ర గర్భంలో ఇలా టన్నెల్ రూపొందించడం దేశంలోనే మెుట్ట మెుదటిగా చెప్పవచ్చు. దీనిని టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM), న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) ద్వారా నిర్మిస్తున్నారు.


ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చులు
ముంబయి – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను రూ. 1.08 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) 81% నిధులను అందిస్తోంది. అంటే సుమారు రూ.88,087 కోట్ల నిధులను రుణ రూపేణా అందించనుంది. 0.1% వడ్డీ రేటుతో 50 సంవత్సరాల కాలానికి జపాన్ ఈ నిధులు అందిస్తోంది. ఇక మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు భరించనున్నాయి.

పనుల పురోగతి
మెుత్తం 508 కిలోమీటర్లు పొడవైన ముంబయి-అహ్మదాబాద్ కారిడార్ పనుల్లో 304 కి.మీ మేర వయాడక్ట్ పనులు పూర్తయినట్లు NHSRCL తాజాగా ప్రకటించింది. అలాగే 388 కి.మీ మేర పైర్ వర్క్స్ ఫినిష్ చేసినట్లు స్పష్టం చేసింది. పూర్తయిన వాటిలో 14 నది వంతెనలు, 7 స్టీల్ బ్రిడ్జెస్, 5 కాంక్రీట్ వంతెనలు ఉన్నట్లు చెప్పింది. ఓవరాల్ గా చూస్తే గుజరాత్ లో 20 రివర్ బ్రిడ్జ్‌లలో 12 పూర్తి (నర్మదా రివర్‌పై 1.4 కి.మీ బ్రిడ్జ్ సహా) అయ్యాయి. థానే క్రీక్ వద్ద 7 కి.మీ అండర్‌సీ టన్నెల్ నిర్మాణంలో ఉంది. గుజరాత్‌లో 53%, మహారాష్ట్రలో 25.6% మేర బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.

టికెట్ ధర ఎంత ఉండొచ్చు?
బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే దాని ఎండ్ టూ ఎండ్ ధర రూ. 3,000 – 3,500 మధ్య ఉండొచ్చని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ముంబయి – అహ్మదాబాద్ మధ్య నడిచే దురొంతో ఎక్స్ ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ కంటే 1.5 రెట్లు ఎక్కువ. ఇక బుల్లెట్ ట్రైన్ ద్వారా భారీగానే ఉద్యోగాలు లభించే అవకాశముంది. 4,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 20,000 పరోక్ష ఉద్యోగాలు వస్తాయని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే 20000 మంది నిర్మాణ కార్మికులకు ఉపాధి పొందుతున్నారు.

Also Read: Notice to KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

ప్రాజెక్ట్ టైమ్ లైన్..
ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు 2017లోనే బీజం పడింది. 2017 సెప్టెంబర్ 14న అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే (Shinzo Abe)తో కలిసి బుల్లెట్ ప్రాజెక్ట్ పనులకు ప్రధాని మోదీ (PM Modi) శంకుస్థాపన చేశారు. 2026లో సూరత్-బిలిమోరా సెక్షన్‌లో ట్రయల్ రన్‌లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 నాటికి పూర్తి కారిడార్ తో దేశంలో బుల్లెట్ ట్రైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.

Also Read This: Sridhar Babu: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6 వేల ఉద్యోగాలు.. మంత్రి ప్రకటన

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు