Notice to KTR: కేటీఆర్‌కు షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Notice to KTR (Image Source; Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Notice to KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Notice to KTR:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణ.. ఇటీవల ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ (Utnoor Police Station, Adilabad)లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును కేటీఆర్ హైకోర్టు (Telangana High Court)లో సవాలు చేశారు. దీంతో కేటీఆర్ కు అనుకూలంగా ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Also Read: Bunny Vas: పెద్ద హీరోలనూ ఉద్దేశిస్తూ బన్నీ వాస్ చేసిన పోస్ట్ వైరల్.. ఎంత ధైర్యం? 

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ (Athram Suguna) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ అవినీతి చేసిందంటూ కేటీఆర్ చేసిన అసత్య ప్రచారాలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం కేటీఆర్ కు నోటీసులు పంపింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్ పై కేటీఆర్ ను వివరణ కోరింది. దీనిపై కేటీఆర్ స్పందన ఎలా ఉండనుందో తేలాల్సి ఉంది.

Also Read This: Sridhar Babu: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6 వేల ఉద్యోగాలు.. మంత్రి ప్రకటన

Just In

01

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?