Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా ఈ హీరోపై ఓ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసిందిన. ఆమె చెబుతున్నట్లు ఆ హీరోయిన్ ని సెట్ లో ఆ విధంగా టార్చర్ చేశారా? ఆమె ఎంత బాధ పడి ఉంటే భయం లేకుండా సల్మాన్ పేరు ధైర్యంగా చెబుతుంది. అసలు, సల్మాన్ ఖాన్ ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం..
సల్మాన్ ఖాన్ టార్చర్ కు గురైన హీరోయిన్ మరెవరో కాదు.. మన తెలుగులో మురారి, ఖడ్గం వంటి మూవీస్ తో హీరోయిన్ గా నటించి స్టార్ స్టేటస్ సోనాలి బింద్రే మనందరికీ సుపరిచితమే.
నిత్యం టార్చర్ చేసేవాడు: సోనాలి బింద్రే
నార్త్, సౌత్ లో ఓ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సోనాలి బింద్రే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో హమ్ సాత్ సాత్ హై అనే చిత్రంలో నటించింది. అయితే, ఈ చిత్ర షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ తనను ఇబ్బంది పెట్టాడని ఓ ఇంటర్వ్యూ లో ఈ ముద్దుగుమ్మ ఓపెన్ గా చెప్పేసింది. అంతే కాదు, నిత్యం టార్చర్ చేసేవాడని చెప్పింది. నాతో తప్ప అందరితో బాగానే ఉండేవాడు. అంతే కాదు తనని పక్కన పెట్టి చాలా చీప్ గా చూసేవాడని సల్మాన్ ఖాన్ గురించి నమ్మలేని నిజాలు బయట పెట్టింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వామ్మో సల్మాన్ ఖాన్ మనుషులను ఇలా కూడా చూస్తాడా ? అంతేలే డబ్బు ఉన్నోళ్ళు కదా .. ఏం చేసిన కూడా అడిగే వాళ్ళు ఉండరు .. ఎలా అయిన బిహేవ్ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సల్మాన్ ఫ్యాన్స్ అయితే, వారి అభిమాన హీరో ఇలా చేశాడంటే .. దీన్ని నమ్మలేకపోతున్నారు