Konda Surekha( image credit: twitter)
Politics

Konda Surekha: రాజన్న కోడెలపై రాజకీయం వద్దు.. మంత్రి సంచలన కామెంట్స్!

Konda Surekha: రాజన్న కోడెలపై రాజకీయం చేయొద్దని మంత్రి కొండా సురేఖ కోరారు. 10 ఏళ్లలో వేములవాడ టెంపుల్ కు, దేవాదాయ శాఖకు సంబంధించి బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో చెప్పగలరా? ప్రశ్నించారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ టెంపుల్ కి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హామీ ఇచ్చిన నిధులు కేటాయించకపోవడం వల్లనే వేములవాడలో రాజన్న కోడెలకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహించాలని కోరారు.

దేళ్లు దేవాదాయ శాఖలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా?

నేడు ఈ కోడెల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనే అని ఆరోపించారు. కోడెల మృతి ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని తగిన చర్యలు తీసుకొని ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. అయినా, ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేయడం సరికాదన్నారు. పదేళ్లు దేవాదాయ శాఖలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా అంటూ నిలదీశారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజకీయ ప‌రిణామాల‌పై బీఆర్ఎస్ నాయ‌కుల మాటలు, స్పందనలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

Also Read: Shocking Murder: వృద్ద దంపతుల.. దారుణ హత్య!

ఇష్టారీతిన దోచుకున్న కల్వకుంట్ల దండుపాళ్యం

కల్వకుంట్ల కుట్రలను రాష్ట్ర ప్రజలు వినాలా? విని నమ్మాలా ? అంటూ మంత్రి ప్రశ్నించారు.” గ‌త పదేండ్ల పాటు రాష్ట్ర సంప‌ద‌ను ఇష్టారీతిన దోచుకున్న కల్వకుంట్ల దండుపాళ్యం బ్యాచ్ నేడు కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంటే.. విషపురుగులై.. విషసర్పాలై..రాబంధులై.. ఉద్వేగం పేరుతో మ‌న‌ల్ని ఉన్మాదుల‌ను చేసే కుట్ర‌కు పాల్ప‌డుతుండ‌టం బాధాకరమన్నారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత గొడవలతో బీఆర్ఎస్ నాయ‌కుల‌కు ఏం మాట్లాడాలో.. ఏ విధంగా స్పందించాలో అర్థం కావ‌డం లేదన్నారు.

వేములవాడలో సువిశాలమైన గోశాల ఏర్పాటు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సమీపంలో ఎన్కేపల్లిలో గోశాల ఏర్పాటు చేయాలని ఇటీవలే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. వేములవాడలో కూడా సువిశాలమైన గోశాల ఏర్పాటు చేద్దామని, అందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి తమకు సూచించారన్నారు. తమ అధికారులు, తామంతా అదే ప‌ని మీద ఉన్నారన్నారు. తమ ప్రజా ప్రభుత్వాన్ని నిందించే ముందు బీఆర్ఎస్ పదేండ్ల దుర్మార్గాన్ని, దయ్యాల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలని.. భక్తుల విశ్వాసాలు, దేవుళ్లపై రాజకీయ కుట్రలు మానుకోవాలన్నారు.

వేములాడ రాజ‌న్న విష‌యంలో గానీ, కోడెల విష‌యంలో తమ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించిందన్నారు. ఘ‌ట‌న‌పై స్థానిక క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝాను వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్ళి ప‌రిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. తీసుకోవాల్సిన చ‌ర్య‌ల నిమిత్తం ప్ర‌భుత్వానికి ఆయ‌న నివేదించ‌గా, తాము కోడెల ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు సైతం తీసుకున్నామన్నారు.

Also Read: Bachupally Police: వివాహేతర సంబంధమే.. హత్యకు కారణమా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!