Medchal Govt Hospital: మేడ్చల్( Medchal) పట్టణంలో నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో గత ఆరు నెలల నుంచి భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయినప్పటికీ జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు నోరు మెదపకపోవడం శోచనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రయత్నం చేయకపోవడంపై పేద ప్రజల ఆరోగ్యం పై వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం భవన నిర్మాణం పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోవడం లేదని వారు పేర్కొంటున్నారు. మేడ్చల్ పరిసర ప్రాంతాలలో 50 పడకల ఆసుపత్రి చుట్టూతా ఎక్కడా అందుబాటులో లేకపోవడం.. ఉన్న ఈ ఒక్క ఆసుపత్రి భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడం తో పేద ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు.
AlsoRead: Rythu Bharosa: రైతులకు రైతు భరోసా.. వ్యవసాయ శాఖ మంత్రి కీలక వాఖ్యలు!
2022లో భవన నిర్మాణానికి శ్రీకారం..
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో ఆస్పత్రి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ 7.50 కోట్ల నిధులను భవన నిర్మాణం కోసం కేటాయించారు. మొదట 50 పడకల ఆసుపత్రి గా నిర్ణయించగా.. ఇప్పుడు అది 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ విద్యా విధాన పరిషత్ కుఆసుపత్రి భవన నిర్మాణానికి.. మోక్షమెప్పుడో? అప్పగించారు. అయితే నిధులు మంజూరు కాకపోవడం వల్ల గత ఆరు నెలల క్రితం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
మేడ్చల్ సమీప ప్రాంతాలలో వంద పడకల ఆసుపత్రి లేకపోవడం వల్ల ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తయితే పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు భావించారు. అయితే నిధులు మంజూరు కాకపోవడం వల్ల పేద ప్రజల ఆనందం ఆవిరైపోయింది. భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన 50 పడకల ఆసుపత్రి భవనాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేతలపైనే ఉందని మేడ్చల్ వాసులు అంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అర్ధాంతరంగా ఆగిపోయిన భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేయించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఉన్న ఏడుగురు డాక్టర్లు డిప్యూటేషన్ పైనే!
మేడ్చల్ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏడుగురు డాక్టర్లు డిప్యూటేషన్ పైనే పనిచేస్తున్నారు. ఈ ఆస్పత్రికి పూర్తిస్థాయి డాక్టర్లు లేరు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఏడుగురు డాక్టర్లు ఉండగా, ఐదుగురు నర్సులు పని చేస్తున్నారు. మేడ్చల్ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల తో ఈ ఆస్పత్రి ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. అయితే ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వైద్య సేవలకు వచ్చే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ ఆస్పత్రిలో డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆస్పత్రికి వచ్చే రోగులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల పిడుగుపాటుకు ట్రాన్స్ ఫార్మర్ కాలిపోవడంతో ఆస్పత్రిలో ఉన్న వైర్లు కాలిపోవడంతో ఆసుపత్రిలో విద్యుత్ సమస్య నెలకొంది. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తిస్థాయి డాక్టర్లను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.