MLA harish Rao: ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. క్యాబినెట్ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేబినెట్ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, పంచ పాండవులు ఎంత మంది అంటే మంచం కోళ్లలాగ ముచ్చటగా ఇద్దరు అని ఒక వేలు చూపించినట్లు ఉందని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం లో ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 DA లను తక్షణం చెల్లిస్తాం అని అభయహస్తం మేనిఫెస్టో లో నమ్మ బలికి 5 DA పెండింగ్ లో పెట్టారు.
ఇప్పుడు ఉసూరు మంటూ ఒక్క DA రిలీజ్ చేశారని, ఇదేనా DA లు సకాలం లో ప్రకటించడం, బకాయిలను నేరుగా చెల్లించడం అంటే రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. అధికారం లో వచ్చిన 6 నెలల్లో PRC ఏర్పాటు అని మభ్య పెట్టి, 18 నెలలు గడుస్తున్నా PRC ఊసే లేదు అని మండిపడ్డారు. ఆరు నెలల తరువాత ఇంకో DA అని చెప్పడం విడ్డూరం అని పేర్కొన్నారు. జనవరి, జూలై నెలలో సంవత్సరానికి రెండు DA లు ఉద్యోగస్తులకు ఇస్తారని, 2025 జనవరి DA కేంద్రం మార్చి లో ప్రకటించారు.
Also Read: Viral News: ప్లాస్టిక్ వాడవద్దని వేడుకుంటున్న.. నవ దంపతులు!
పిఆర్సి ప్రస్తావన లేదు, పెండింగ్ బకాయిలు ప్రస్తావన లేదు
జూలై నెల DA ను సెప్టెంబర్ లో కేందం ప్రకటించే అవకాశం ఉందన్నారు. అటువంటి అప్పుడు 6 నెలల తర్వాత DA ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. BRS ప్రభుత్వం ఇచ్చిన EHS scheme GO ను ఇప్పుడు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరం అన్నారు. పిఆర్సి ప్రస్తావన లేదు, పెండింగ్ బకాయిలు ప్రస్తావన లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావన లేదు.ఇవేవీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
ముఖ్యమంత్రి ?కేబినెట్ నిర్ణయం లేకుంటే అప్పుడు ఎందుకు చెక్కులు ఇచ్చినట్లు?
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని మరోసారి నిరూపితమైందన్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పినట్లు పెండింగ్ డి ఏ లు అన్ని తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటికే రెండు సార్లు ఇచ్చిన చెక్కులపై మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం హాస్యాస్పదం?అంటే గతంలో రెండు సార్లు మీరు పంపిణీ చేసిన చెక్కులకు విలువ లేదా ముఖ్యమంత్రి ?కేబినెట్ నిర్ణయం లేకుంటే అప్పుడు ఎందుకు చెక్కులు ఇచ్చినట్లు?నవంబర్ 19, 2024 నాడు వరంగల్ లో స్వయం సహాయక సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందించారు.
క్యాబినెట్ నిర్ణయం అంటూ మాటలు చెబుతున్నారు?
మళ్ళీ అవే చెక్కులను మార్చి 8, 2025 నాడు ఇందిరా మహిళా శక్తి పేరిట హైదరాబాద్ లో నిర్వహించిన సభలో సీఎం అందించారు. స్వయంగా ముఖ్యమంత్రి మహిళ సంఘాలకు రెండు సార్లు ఆవే చెక్కులు ఇచ్చినా ఇప్పటికి చెల్లుబాటు కాలేదు.ఇప్పుడు మరోసారి క్యాబినెట్ నిర్ణయం అంటూ మాటలు చెబుతున్నారు? ఇంకెన్ని సార్లు చెక్కులు, నిర్ణయాలు.. ఈసారైనా చెక్కులు క్లియర్ అవుతాయా? అని నిలదీశారు.
Also Read: Abhay Patil: స్వరం మార్చిన బీజేపీ.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అభయ్ పాటిల్?