June 6th Holiday (Image Source: Twitter)
జాతీయం

June 6th Holiday: రేపు హాలీడే అంటూ జోరుగా ప్రచారం.. అందులో వాస్తవమెంత?

June 6th Holiday: కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. జూన్ 6న పబ్లిక్ హాలీడేగా మోదీ సర్కార్ ప్రకటించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన బక్రీద్ సందర్భంగా ఈ హాలీడేను ప్రకటించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

ఆ రాష్ట్రాల్లో రేపు సెలవు?
బక్రీద్ సందర్భంగా జూన్ 6న పలు రాష్ట్రాలకు పబ్లిక్ హాలీడే కేంద్రం ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూత పడతాయని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించకపోవడం సందేహాలకు తావిస్తోంది.

సెలవుల్లో కన్ఫ్యూజన్!
వాస్తవానికి కేంద్రం సహా రెండు తెలుగు రాష్ట్రాలు జూన్ 7ను పబ్లిక్ హాలీడే కింద ప్రకటించాయి. అయితే తాజాగా జూన్ 6 కూడా సెలవు అని ప్రచారం జరుగుతుండటం గందరగోళానికి దారి తీస్తోంది. ఇందుకు ఓ బలమైన కారణమే ఉంది. నిజానికి కేరళలోని కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాల్లో జూన్ 6ను సెలవు దినంగా ప్రకటించారు. అటు గుజరాత్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జూన్ 6న బ్యాంకులకు సెలవులు ఇచ్చారు. జూన్ 6 సాయంత్రం నుంచి పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక సెలవులు ప్రాంతాలు, రాష్ట్రాన్ని బట్టి మారే ఛాన్స్ ఉంది.

Also Read: Gold Rate ( 05-06-2025) : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

వరుసగా 3 రోజులు సెలవు!
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం జూన్ 7న బక్రీద్ హాలీడేను ప్రకటించారు. అయితే ఇక్కడి మస్లింలు ఈద్ పండుగలకు సౌదీ అరేబియా చంద్ర దర్శనాన్ని పరిగణలోకి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారం చూస్తే సౌదీలో జూన్ 6న చంద్ర దర్శనం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు తమ మనసు మార్చుకొని రేపు కూడా బక్రీద్ హాలీడే ప్రకటించే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వరుసగా మూడ్రోజులు (శుక్ర, శని, ఆది) సెలవులు రానున్నాయి.

Also Read This: Tatkal Booking Update: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేలో కొత్త రూల్.. తెలుసుకోకుంటే కష్టమే!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు