RCB Banned from IPL: ఐపీఎల్ 2025 విన్నర్ గా ఆర్సీబీ నిలిచింది. ప్రస్తుతం, ఆర్సీబీ కి సంబందించిన పోస్టులే తెగ వైరల్ అవుతున్నాయి. 2025 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈజీగా ఛేజ్ చేయాల్సిన మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడం ఏంటని చాలా మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఆర్సీబీ కల నెరవేరింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 120 బాల్స్ లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి దిగిన పంజాబ్.. 120 బాల్స్ లో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కేవలం 6 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గెలిచి కొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. ఫైనల్ మ్యాచ్ లో చివరి వరకు పోటా పోటీగా ఆడాయి. ఒకసారి ఆర్సీబీ, మరొకసారి పంజాబ్ రేసులోకి వచ్చాయి. అయితే, చివరికి ఆర్సీబీనే కప్పును ముద్దాడింది.
Also Read: Manchu Vishnu And Prabhas: ప్రభాస్ ను చాలా ఇబ్బంది పెట్టాను.. మంచు విష్ణు సంచలన కామెంట్స్
ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నతర్వాత విజయోత్సవ వేడుకలను చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒక కల నిజం చేయడం కోసం ..దేవుడు ఇలా అమాయకులు ప్రాణాలుతీసుకెళ్లిపోయాడు. అకస్మాత్తుగా జరగడంతో సంతోషం కాస్తా విషాదాంతంగా మారింది.
Also Read: MLC Kavitha: తండ్రిపై పొగడ్తలు.. కాంగ్రెస్‌కు చివాట్లు.. మహాధర్నాలో కవిత ఏమన్నారంటే!
ఈ క్రమంలోనే ఐపీఎల్ నుంచి ఆర్సీబీని బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత మీకు కప్పు వచ్చిందని సంతోషపడాలా లేక మీ వలనే 11 మంది చనిపోయారని బాధ పడాలా? మాకు ఇప్పుడు సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉందని నెటిజన్లు మండి పడుతున్నారు. ఏదోక నిర్ణయం తీసుకుని, ఆర్సీబీని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని చూడాలో అని కామెంట్స్ చేస్తున్నారు.