Manchu Vishnu And Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 27న విడుదల కానుంది. దీంతో, మార్చి నుంచి మంచు విష్ణు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. కన్నప్ప మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే, విడుదలైన టీజర్ లో అందర్నీ చూశారు.
Also Read: Virat Kohli: ఏడ్చేసిన విరాట్ కోహ్లి.. ఇన్నేళ్ళు ఎంత బాధను దాచుకున్నవయ్యా.. అంటూ నెటిజన్ల కామెంట్స్
ముఖ్యంగా, ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఉండటంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నాడు.
Also Read: Gandhi Bhavan: సమస్యల పరిష్కారంపై క్లారిటీ ఇవ్వని గాంధీభవన్.. అప్లికేషన్లు పెండింగ్!
తాజాగా, మంచు విష్ణు ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ” నేను ప్రభాస్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాను. కన్నప్ప మూవీలో ఉన్న పాత్రలన్ని తన ముందు పెట్టాను. అప్పుడు తను రుద్ర అనే పాత్రను ఎంచుకున్నాడు. ఒక నటుడిగా రుద్ర పాత్ర ప్రభాస్ సినీ కెరియర్లో నిలిచిపోతుంది. షూటింగ్ అయి పోయాక.. ఇద్దరం కలిసి డైలాగ్స్ ఎంజాయ్ చేశామని చెప్పాడు. అయితే, డైలాగ్స్ విషయంలో ప్రభాస్ ని చాలా ఇబ్బంది పెట్టాను అని కామెంట్స్ చేశాడు.
Also Read: Ram Charan : రామ్ చరణ్ ఆ సమస్యతో చాలా బాధ పడుతున్నాడు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇబ్బంది పడే వాడు. పెద్ద డైలాగ్స్ ఇవ్వకు అని మొఖం మీదే చెప్పేవాడు. అప్పుడు ప్రభాస్ కోసం కొన్ని డైలాగ్స్ మార్చేవాళ్ళం. ప్రభాస్ అభిమానులను కూడా గౌరవించాలి. ఫ్యాన్స్ ని హర్ట్ చేయకూడదు. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర దాదాపు 30 నిముషాలు ఉంటుందని తెలిపాడు.