Let's Tell The Looters To Mind With A Lok Sabha Vote
Politics, Top Stories

Telangana: వారసుల ఫైట్.. ఎన్నికల బరిలో నెక్స్ట్ జనరేషన్

– రాజకీయ వారసత్వం కోసం సీనియర్ల ఆరాటం
– పార్టీల టికెట్లు సంపాదించి మరీ పోటీకి
– ఏ పార్టీలో ఎవరెవరు?

Dynastic politics: రాజకీయాల్లో వారసత్వం చాలా కామన్. ప్రతి ఎన్నికల్లో కొత్త వారసత్వం హడావుడి కనిపిస్తూ ఉంటుంది. తమ వారసులను అందలమెక్కించడానికి సీనియర్లు తెగ ఆరాటపడుతూ ఉంటారు. తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి పార్టీ టికెట్లు సంపాదించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తారు. ఎలాగోలా టికెట్ సంపాదించి ఎన్నికల బరిలోకి తమ నెక్స్ట్ జనరేషన్‌ను దింపుతారు. ఈ ఎన్నికల్లో కూడా అలాంటి కొత్త తరం బరిలోకి దిగింది. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమై లేదు. ప్రతి పార్టీలో ఇలాంటి సంప్రదాయం ఉన్నది. వారసత్వ రాజకీయాలు చేయబోమని గంభీరంగా చెప్పే బీజేపీలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న మన తెలంగాణలో ఇలా కొత్త తరం నాయకులు ఎక్కడెక్కడ.. ఎవరెవరు పోటీ చేస్తున్నారో చూద్దాం.

ఎస్సీ రిజర్వ్డ్ పెద్దపల్లి స్థానం నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. గడ్డం వెంకటస్వామి పెద్దపల్లి నుంచి ఎంపీగా చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు గడ్డం వివేక్ కూడా ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా, ఆయన కుమారుడు గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ టికెట్ పై పెద్దపల్లి నుంచి పోటీకి నిలిపారు.

Also Read: ఇండియాకు రాకుండా చైనాకు చెక్కేసిన ఎలన్ మస్క్

వెలిచాల జగపతి రావు కొడుకు వెలిచా రాజేందర్. ఈయన ఇప్పుడు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. 2009లో వెలిచాల రాజేందర్ పీఆర్పీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. వెలిచాల జగపతి రావు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా చేశారు. 2022లో మరణించారు.

నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరో సారి అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన తండ్రి డీ శ్రీనివాస్ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ టికెట్ పై బరిలో ఉన్న సునీతా మహేందర్ రెడ్డి భర్త మహేందర్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

చేవెళ్ల నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేవీ రంగారెడ్డి మనవడు. కేవీ రంగారెడ్డి దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా చేశారు. నీలం సంజీవరెడ్డి క్యాబినెట్‌లోనూ మంత్రిగా చేశారు.

నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో మల్లురవి కేంద్రమంత్రిగా చేసిన మల్లు అనంతరాములుకు సొంత తమ్ముడు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న పోతుగంటి భరత్.. పీ రాములు కుమారుడు. పోతుగంటి రాములు బీఆర్ఎస్ టికెట్ పై గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి కొడుకు భరత్‌కు టికెట్ పొందారు.

Also Read: ఎంఐఎం క్యాంపెయిన్‌లో తెలుగు పాట.. మార్పు మంచిదే..!

నల్గొండ నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి కొడుకు రఘువీర్ కుందూరు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ పై రఘువీర్ తన రాజకీయ భవితవ్యాన్ని పరీక్షిస్తున్నారు. నల్గొండ నుంచే బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్న కంచర్ల క్రిష్ణా రెడ్డి అన్నయ్య కంచర్ల భూపాల్ రెడ్డి. ఈయన గతంలో నల్గొండ ఎమ్మెల్యేగా చేశారు.

వరంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై కడియం శ్రీహరి కూతురు కావ్య బరిలో ఉన్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగానూ వ్యవహరించారు. బీఆర్ఎస్ కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత మరీ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. మహబూబాబాద్ నుంచి రెడ్యా నాయక్ కుమార్తె మాలోత్ కవిత బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ కవితనే. ఇప్పుడు మరోసారి అదే పార్టీ నుంచి పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్ టికెట్ కోసం రసవత్తర పోరు జరిగిన ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యేగా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడే. రఘురామ్ రెడ్డి తొలిసారిగా లోక్ సభ ఎన్నికల బరిలో దిగారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు