Wednesday, May 15, 2024

Exclusive

AIMIM: ఎంఐఎం క్యాంపెయిన్‌లో తెలుగు పాట.. మార్పు మంచిదే..!

Telugu Song: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటర్ల కోసం తెలుగు పాటను విడుదల చేసింది. ఎంఐఎంకు ఎక్కువగా ఓల్డ్ సిటీలో పట్టు ఉన్నది. హైదరాబాద్ లోక్ సభ సీటును 1984 నుంచి ఆ పార్టీనే గెలుచుకుంటూ వస్తున్నది. ఒవైసీ కుటుంబమే హైదరాబాద్ లోక్ సభకు అత్యధికంగా ప్రాతినిధ్యం వహించింది. ఓల్డ్ సిటీలో ఎక్కువగా ముస్లింలు ఉండటం, వారు ఎక్కువగా ఉర్దూ, హిందీ భాషల్లో మాట్లాడటం మూలంగా ఎంఐఎం తమ ప్రచారంలో తెలుగు పాటలను ఎంపిక చేసుకోదు. వాళ్ల ప్రసంగాలు కూడా చాలా వరకు ఉర్దూలోనే సాగుతుంటాయి. కానీ, కొన్ని రోజులుగా ఎంఐఎం క్యాంపెయిన్‌లో కొన్ని మార్పులు వస్తున్నాయి.

గత పదేళ్లలో బీఆర్ఎస్‌తో అవగాహనతో బరిలోకి దిగిన ఎంఐఎం సులువుగా ఇక్కడి నుంచి గెలిచేది. బీఆర్ఎస్ అధికారం నుంచి పోవడం.. మరోవైపు బీజేపీ హైదరాబాద్ లోక్ సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రచారం చేయడం వంటివి ఎంఐఎం పార్టీకి కొంత ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. ముస్లిం సహా అన్ని వర్గాల మద్దతు ఉండే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముస్లిం కమ్యూనిటీకి చెందిన నాయకుడిని బరిలో నిలపడం కూడా అసదుద్దీన్‌కు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఒవైసీ కేవలం ముస్లిం ఓట్లనే కాదు.. ఇతర కమ్యూనిటీ ఓట్లపైనే గురిపెట్టారు. గతంలోనూ అసదుద్దీన్‌కు ఇతర కమ్యూనిటీల ఓట్లు కూడా పడేవి. కానీ, ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది.

Also Read: ఎంట్రీ ఇచ్చాడో లేదో సోషల్ వార్ మొదలైందిగా..!

ఎంఐఎం పార్టీ తమ పొలిటికల్ క్యాంపెయిన్‌లో తెలుగు పాటలను పెద్దగా ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తెలుగు పాటను ఒక ప్రచారాస్త్రంగా ఎంఐఎం మొదలు పెట్టింది. తాజాగా మరోమారు హైదరాబాద్ లోక్ సభ సీటు కోసం, ఎంఐఎం పార్టీ కోసం ప్రత్యేకంగా నల్గొండ గద్దర్ (కాసాని నర్సిరెడ్డి)తో పాడించి రూపొందించిన పాటను విడుదల చేశారు. ఈ పాట ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ చుట్టూతే ఉన్నది.

ఎంఐఎం పార్టీ జెండాతోపాటు చాలా చోట్ల జాతీయ జెండా ఈ పాటలో కనిపిస్తున్నది. అసదుద్దీన్ ఒవైసీ మతాలకు అతీతంగా అన్ని వర్గాలతో కలిసిపోవడం, ముస్లిం, సిక్కు, హిందూ గురువులను కలిసిన దృశ్యాలనూ ఈ పాట వీడియోలో చేర్చారు. అందరి నాయకుడని, అన్ని మతాలను గౌరవించే ప్రతినిధి అని ఈ పాటలో అసదుద్దీన్‌ను చిత్రించారు.

Publisher : Swetcha Daily

Latest

Revanth Reddy: విద్య.. వైద్యం.. సాగు!.. వీటిపైనే ప్రభుత్వం ఫోకస్

- జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తాం - హైదరాబాద్ ఎట్టిపరిస్థితుల్లో యూటీ కాదు -...

MP Laxman: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం!

- బీఆర్ఎస్ చచ్చిన పాము - త్వరలో కూటమిలో కానీ, కాంగ్రెస్‌లో...

KTR: టైమ్‌పాస్.. సర్కార్

- 5 నెలలు దాటింది.. కాంగ్రెస్ చేసిందేంటి? - టైమ్ పాస్...

Bhatti: నో డౌట్.. 14 సీట్లు కాంగ్రెస్‌వే

Telangana Elections: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 13 నుంచి 14...

Don't miss

Revanth Reddy: విద్య.. వైద్యం.. సాగు!.. వీటిపైనే ప్రభుత్వం ఫోకస్

- జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తాం - హైదరాబాద్ ఎట్టిపరిస్థితుల్లో యూటీ కాదు -...

MP Laxman: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం!

- బీఆర్ఎస్ చచ్చిన పాము - త్వరలో కూటమిలో కానీ, కాంగ్రెస్‌లో...

KTR: టైమ్‌పాస్.. సర్కార్

- 5 నెలలు దాటింది.. కాంగ్రెస్ చేసిందేంటి? - టైమ్ పాస్...

Bhatti: నో డౌట్.. 14 సీట్లు కాంగ్రెస్‌వే

Telangana Elections: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 13 నుంచి 14...

Revanth Reddy: విద్య.. వైద్యం.. సాగు!.. వీటిపైనే ప్రభుత్వం ఫోకస్

- జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తాం - హైదరాబాద్ ఎట్టిపరిస్థితుల్లో యూటీ కాదు - ఫోన్ ట్యాపింగ్ గురించి అసెంబ్లీలో చెబుతాం - మిల్లర్లు అక్రమాలు చేస్తే తాట తీస్తాం - రైతు రుణ మాఫీ మాట నిలబెట్టుకుంటాం -...

MP Laxman: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం!

- బీఆర్ఎస్ చచ్చిన పాము - త్వరలో కూటమిలో కానీ, కాంగ్రెస్‌లో కానీ విలీనం ఖాయం - హస్తాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు - ఉచితాల పేరుతో భ్రమలు కల్పిస్తోంది - కూటమికి...

KTR: టైమ్‌పాస్.. సర్కార్

- 5 నెలలు దాటింది.. కాంగ్రెస్ చేసిందేంటి? - టైమ్ పాస్ చేస్తోంది - కాంగ్రెస్, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది - కేసీఆర్ బస్సు యాత్ర రాజకీయాల్లో కీలక మలుపు - మెజార్టీ సీట్లు...