Saturday, May 18, 2024

Exclusive

Revanth Reddy: విద్య.. వైద్యం.. సాగు!.. వీటిపైనే ప్రభుత్వం ఫోకస్

– జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తాం
– హైదరాబాద్ ఎట్టిపరిస్థితుల్లో యూటీ కాదు
– ఫోన్ ట్యాపింగ్ గురించి అసెంబ్లీలో చెబుతాం
– మిల్లర్లు అక్రమాలు చేస్తే తాట తీస్తాం
– రైతు రుణ మాఫీ మాట నిలబెట్టుకుంటాం
– కోడ్ ముగిసిన వెంటనే వర్సిటీలకు వీసీల నియామకం
– కొత్త రేషన్ కార్డులు ఇస్తాం
– రేషన్ షాపులో అందరికీ సన్నబియ్యం
– ప్రతి రోజు సచివాలయానికి వస్తా
– ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు
– పదేళ్లు ఇక్కడే ఉంటా..
– వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తా: సీఎం రేవంత్ రెడ్డి

Congress Govt: రాష్ట్రంలో ఎన్నికల హీట్ చల్లబడింది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదే దూకుడును కొనసాగిస్తున్నారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే మీడియాతో చిట్‌చాట్ చేస్తూ చాలా అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన, రాజకీయ విషయాలపై మాట్లాడుతూ.. రేపటి నుంచి ప్రతి రోజు సచివాలయానికి వస్తానని, సమీక్షలు చేస్తానని తెలిపారు. కొందరు హైదరాబాద్ యూటీ అవుతుందని ఆందోళనపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని, అసలు హైదరాబాద్ యూటీ ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రపాలిత ప్రాంతం కాదని స్పష్టం చేశారు. కొందరు మిడి మిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. రాధాక్రిష్ణ ఎవరో తనకు తెలియదని, ఫోన్ ట్యాపింగ్‌లో ఏం జరిగిందో అసెంబ్లీలో చెబుతామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొందరు రిటైర్డ్ ఉద్యోగులు కొనసాగారని, వారి గురించి కేబినెట్‌లో చర్చిస్తామని, ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందని వివరించారు. పదేళ్లు ఇక్కడే ఉంటానని, వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.

తాట తీస్తాం

పంద్రాగస్టులోపు రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, రైతులను ఒకేసారి రుణ విముక్తలను చేస్తామని వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్ పెట్టి రైతుల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. రైతన్నలకు తమ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, తడిసిన ధాన్యంపై, పంట నష్టంపై సమీక్ష చేసి ఆదుకుంటామని తెలిపారు. మిల్లర్లు అక్రమాలు చేస్తామంటే.. ఉపేక్షించబోమని, తాట తీస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాము చెప్పిన పంటలకు మద్దతు ధర అందిస్తామని చెప్పారు. కర్ణాటక నుంచి నీళ్లు అడిగి తీసుకున్నామని తెలిపారు. కరెంట్ విషయంలో కొందరు అధికారులు కావాలనే తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు, ఆకస్మిక పర్యటనలు ఉంటాయని తెలిపారు.

Also Read: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం!

వర్సిటీలకు వీసీలు

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. పోలింగ్ ముగిసిపోయిందని, ఇక పరిపాలనపైనే ప్రధాన దృష్టి అని చెప్పారు. విద్యా సంవత్సరం మళ్లీ ప్రారంభం అవుతున్నదని, విద్యపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకుంటామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంపైనే ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని వివరించారు. ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే యూనివర్సిటీలకు వైస్ చాన్సిలర్‌లను నియమిస్తామని తెలిపారు. కార్పొరేట్ విద్యలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తామని, టాటాతో నైపుణ్య శిక్షణ అందిస్తామని వివరించారు.

జిల్లాల పునర్విభజనపై కమిషన్

కేసీఆర్ ఇష్టారీతిన జిల్లాలను విభజించారని, జిల్లాల విభజన ఒక పద్ధతి ప్రకారం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ప్రక్రియలో హేతుబద్ధతను చూడాలని, కోటి జనాభా ఉన్న హైదరాబాద్, నాలుగు లక్షల జనాభా ఉన్న వనపర్తి ఒకటేనా? అని ప్రశ్నించారు. మండలాలు, రెవెన్యూ డివిజన్‌లను రేషనలైజ్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేస్తామని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు.

Also Read: పాము పక్కనుంటే చంపుతాం.. లింగం మీదుంటే మొక్కుతాం: బీజేపీకి క్లాస్

నిరంతరం రేషన్ కార్డులు

త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల జారీ అనే ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తామని వివరించారు. రేషన్ షాపుల్లో అందరికీ సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డుతో సంబంధం ఉండదని పేర్కొన్నారు.

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 13 సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అని, తీన్మార్ మల్లన్నను గెలిపిస్తామని వివరించారు. కేసీఆర్‌కు పిచ్చిపట్టిందని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. నిధులు మింగడానికి త్రాగునీటి జలాశయాలు అంటున్నారని వివరించారు. మూసి కారిడార్‌ను ఆదాయ వనరుగా అభివృద్ధి చేస్తామని, ఆర్ఆర్ఆర్ విస్తరణ.. రాష్ట్ర అభివృద్ధికి అడ్రస్‌గా మారుతుందని చెప్పారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని వివరించారు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో ఈ...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ మోసం - భారతీ లేక్ వ్యూ పేరుతో వసూళ్లు - అతి తక్కువ ధరకే ఫ్లాట్ అనడంతో ఎగబడ్డ జనం - రోజులు గడుస్తున్నా...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ - భేటీని వాయిదా వేసిన సీఎం రేవంత్ రెడ్డి - అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలవాలని నిర్ణయం - ఇరిగేషన్ శాఖపై...