- తెలంగాణలో ముగిసిన సార్వత్రిక సమరం
- స్ట్రాంగ్ రూమ్ లలో అభ్యర్థుల భవితవ్యం
- ఫలితాల కోసం జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే
- ముక్కోణపు పోటీలో ఎవరి ధీమా వారిది
- ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే
- బీఆర్ఎస్ కొంప ముంచిన క్రాస్ ఓటింగ్
- మూడో స్థానానికి పరిమితం కాబోతున్న బీఆర్ఎస్
- పల్లెల్లో భారీగా పెరిగిన ఓటింగ్ శాతం
Telangana parliament elections completed EVMs at strong rooms:
తెలంగాణలో సార్వత్రిక సమరం ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా 64•93% పోలింగ్ నమోదవడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక 50.34% పోలింగ్ నమోదయింది. ఇక ఎవరికి వారు సొంత లెక్కల్లో మునిగితేలుతున్నారు. తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనే టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా మూడు పార్టీ మధ్యే హోరాహోరీగా పోరు జరిగింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్న అస్త్రలు ప్రయోగించారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అటు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్.. ఈ మూడు పార్టీలు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో డూ ఆర్ డై అన్నట్లుగా పోరాటం చేశాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాయి. ఇక, తెలంగాణలో . గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేయనుంది? ఎవరికి నష్టం చేయనుంది? తమకు లాభం చేసిందని ఆయా పార్టీలు ఎందుకు భావిస్తున్నాయి? ఇంతకీ విజయంపై ఏ పార్టీ అంచనాలు ఏంటి?
స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు భద్రం
ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను అర్థరాత్రి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి., ఎక్కడా శాంతి భద్రత సమస్యలు తలెత్తలేదు.. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘటనలు, ఫిర్యాదులతో సోమవారం 38 కేసులు నమోదు అయ్యాయి. నెలన్నర పాటు సాగిన సార్వత్రిక సమరంలో తుది అంకం ముగియగా, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ష్ట్రంలో లోక్‌సభ పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు.
బీఆర్ఎస్ నేతల్లో క్రాస్ ఓటింగ్ భయం
రాష్ట్రంలోని మెజారిటీ లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ముఖాముఖీ పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు భారీగా క్రాస్ అయినట్లు చెబుతున్నారు. ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తున్న క్రమంలో క్రాస్ అయిన బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు.. ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వర్గాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరీ, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సలోని కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీ వైపు, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ చేసినట్లూ వార్తలు వస్తున్నాయి. ముక్కోణపు పోటీలు జరిగితే మెజారిటీ సీట్లలో రెండో ప్లేసు దక్కించుకునైనా ఉనికి నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్‌ఎస్ నాయకత్వం ఆశలకు.. ఈ క్రాస్ ఓటింగ్ భారీగా గండి కొట్టినట్లు చెబుతున్నారు. మెజారిటీ సీట్లలో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడేందుకూ ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నాయి.