Tragedy in Agra (Image Source: Twitter)
Viral

Tragedy in Agra: రీల్స్ నింపిన విషాదం.. ఒకే ఫ్యామిలీలో ఆరుగురు బలి.. ఏమైందంటే?

Tragedy in Agra: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారు. అర నిమిషం వీడియో కోసం ఎంతో విలువైన ఆయువును పణంగా పెడుతున్నారు. ఫేమస్ అయ్యేందుకు ముందు వెనక ఆలోచించకుండా సాహాసాలు చేస్తూ కుటుంబాల్లో తీరని విషాధాన్ని నింపుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో ఘోరం చోటుచేసుకుంది. రీల్స్ సరదా ఒక ఫ్యామిలీని పుట్టెడు దుఖంలో నింపేసింది.

వివరాల్లోకి వెళ్తే..
ఆగ్రాలోని యమునా నదిలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు యువతులు స్నానానికి దిగారు. ఈ క్రమంలో నదిలో ఏమరుపాటుగా వారంతా రీల్స్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రవాహం ధాటికి వారంతా నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఆగ్రా పోలీసులు.. రెస్క్యూ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్లతో నదిలో గాలించగా.. ఆరుగురు యువతుల మృతదేహాలు బయటపడ్డాయి.

Also Read: MLC Kavitha: తండ్రిపై పొగడ్తలు.. కాంగ్రెస్‌కు చివాట్లు.. మహాధర్నాలో కవిత ఏమన్నారంటే!

స్పందించిన ప్రభుత్వం
మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయినవారి వయసులు 13 నుంచి 17 ఏళ్ల మధ్య ఉండటం మరింత ఆవేదనకు కలిగిస్తోంది. చనిపోయిన వారిని ముస్కన్ (17), సంధ్యా (15), దివ్యా (14), నైనా (13), సోనం, శివానీగా గుర్తించారు. విపత్తుకు ముందు మృతులంతా సరదాగా వీడియోలు తీసుకున్న దృశ్యాలు.. అందరినీ కంట తడి పెట్టిస్తోంది. ప్రమాద ఘటనపై స్పందించిన యూపీ ప్రభుత్వం (UP Govt).. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఘటనపై కేసు నమోదు చేసిన అగ్రా పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read This: Swetcha Exclusive: మహాధర్నాలో కవిత ప్లాన్ బట్టబయలు.. స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..