Ethanol Factory: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో విషపూరిత ఇత్తనాలు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టొద్దని గత రెండేళ్లుగా నిరసన తెలుపుతున్నారు. రైతుల వ్యతిరేకతను గమనించిన ఇథనాల్ కంపెనీ యాజమాన్యం కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి తాజాగా కంపెనీ నిర్మాణ స్థలంలోకి జెసిబిలు మెటీరియల్ తరలించడంతో పసిగట్టిన రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పోలీసులు యాజమాన్యంతో మాట్లాడి పనులు రైతుల డిమాండ్ మేరకు పనులు చేపట్టవద్దని సూచించగా అందుకు అంగీకరించారు. రాత్రికి రాత్రే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయగా రెండు జెసిబిలు పనిచేసేందుకు సిబ్బంది రావడంతో ఆగ్రహించిన రైతులు మరో మారు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
ఇద్దరు రైతులపై దాడి
ఈ క్రమంలో అఖిలపక్షం నాయకులు సైతం ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమవగా నాగర్ దొడ్డి వెంకటరాములు, కురువ పల్లయ్యను ముందస్తు అరెస్టు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణ స్థలికి రైతులు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో రైతులకు పోలీసులకు తోపులాట జరిగింది. కంపెనీ సిబ్బంది ఇద్దరు రైతులపై దాడి చేయడంతో ఆగ్రహించిన ప్రభావిత 12 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున నిర్మాణ స్థలికి చేరుకోగా అక్కడ ఏర్పాటు చేసిన కంటైనర్ ను తగలపెట్టగా సామాగ్రిని, రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు అధిక సంఖ్యలో వచ్చారు.ఇథనాల్ ఫ్యాక్టరీ కోసమని భూములు సేకరిస్తున్నామని చెప్పకుండా తమను మోసం చేశారని, కేవలం సాగు పేరుతో 27 ఎకరాలు సేకరించారని, కాలుష్య ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మాణం చేపడితే ఇక్కడి భూములు దెబ్బ తినడంతో పాటు అనేక పచ్చని పొలాలు వీలుగా మారి వాతావరణ కాలుష్యం వల్ల రాజోలి మండలంలో నివసించే ప్రజలు తీవ్ర శ్వాస కోస, చర్మ సంబంధించిన వ్యాధులతో బాధపడే పరిస్థితి దాపురిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ ఏం తేల్చుకుంటారో?
ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ ఏర్పాటు
గత రెండేళ్లుగా నిర్మాణానికి ప్రయత్నం చేస్తుండగా రైతులు ఇతనాలు ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేసుకొని అనేక రూపాలలో రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకో కార్యక్రమాలను చేపట్టారు. సమస్య తీవ్రతను గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రైతులకు సంఘీభావం తెలిపారు. కంపెనీ నిర్మాణం చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సైతం కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ జీవితాలను పన్నంగా పెట్టైనా కంపెనీ నిర్మాణాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు పేర్కొంటున్నారు.
Also Read: MLC Kavitha: కవిత లేఖపై ఇంకా వీడని సందిగ్ధం.. పట్టుకోకపోతే ఎలా!