Botsa Satyanarayana: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అందరూ చూస్తుండగానే బొత్స సొమ్మసిల్లిపడిపోవడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. మరోవైపు తీవ్ర అనారోగ్యానికి గురైన బొత్సను.. వైసీపీ నేతలు హుటాహుటీనా అస్పత్రికి తరలించారు.
వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చీపురుపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి బొత్స హాజరయ్యారు. క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయనకు వడదెబ్బ తగిలిందని ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: RCB Fans Celebrations: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ .. అక్కడ 100 మేకలు 250 కోళ్ళతో 3 ఊర్లలో బోజనాలు!
బొత్స సత్యనారాయణ విషయానికి వస్తే ఆయన ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న బొత్స.. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ మంత్రిగా ఆయన వ్యవహరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2024 ఆగస్టు 16న ఆయన బాధ్యతలు చేపట్టారు.