June Upcoming Movies: కళ్లు మూసే సరికి సగం ఏడాది పూర్తయిపోయింది. జూన్ నెలలోకి సైతం ఎంటర్ అయిపోయాం. అయితే ఈ నెల సినీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. బ్లాక్ బాస్టర్ చిత్రాలు లేక సమ్మర్ ను చప్పగా గడిపిన సినీ ప్రేక్షకులకు అసలైన మజాను అందించేందుకు జూన్ లో టాప్ హీరోల చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్ లో మంచి సినిమా చూసి చాలా కాలమైందని భావించే వారికి.. ఈ నెల పండగేనని చెప్పవచ్చు. ఇంతకీ ఈ నెలలో రాబోతున్న చిత్రాలు ఏవి? ఎప్పుడు తేదీన రిలీజ్ అవుతున్నాయి? ఆయా చిత్రాల విశేషాలేంటీ? ఇప్పుడు తెలుసుకుందాం.
థగ్ లైఫ్ (Thug Life)
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), స్టార్ డైరెక్టర్ (Maniratnam) రూపొందిన చిత్రం థగ్ లైఫ్. ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. 38 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇందులో మరో స్టార్ హీరో శింభు సైతం కీలక పాత్రలో నటించారు.
గ్యాంబ్లర్స్ (Gamblers)
టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్(Sangeeth Shobhan).. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో ఎంతటి క్రేజ్ సంపాదించాడో అందరికీ తెలిసిందే. అతడు సోలో హీరోగా చేసిన ‘గ్యాంబ్లర్స్’ చిత్రం.. జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహించగా.. ప్రశాంతి చారులింగా హీరోయిన్ నటించింది. రాకింగ్ రాకేష్, సాయి శ్వేత, జస్విక పృథ్విరాజ్ బన్న కీలక పాత్రల్ల నటించారు.
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిచిత్రం రాబోతోంది. పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకులను అలరించబోతోంది. జూన్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటించింది.
కుబేర (Kubera)
జూన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా కింగ్ నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెలలోనే థియేటర్లను పలకరించనుంది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహించారు. జూన్ 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో నాగార్జున సీఐడీ ఆఫీసర్ కాగా.. ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారు.
8 వసంతాలు (8 Vasanthalu)
అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఇందులో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ ఇతర పాత్రలు పోషించారు.
కన్నప్ప (Kannappa)
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న కన్నప్ప కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. జూన్ చివరి వారంలో 27వ తేదీన ప్రేక్షలను పలకరించనుంది. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ తో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు ఇందులో నటించడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: KTR: ఏఐతో దేశ యువత పోటీ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!
మార్గన్ (Margan)
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం మార్గన్. లియో జాన్ పాల్ దర్శకుడు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.