Prashanth Neel on RCB Victory
ఎంటర్‌టైన్మెంట్

Prashanth Neel: ఆర్సీబీ విజయంతో ‘ఎన్టీఆర్‌నీల్’ సెట్స్‌లో ప్రశాంత్ నీల్ బీభత్సం

Prashanth Neel: సినిమా, క్రికెట్ పరిధిని కొలవడానికి ప్రస్తుతానికి ఏ తూనికలు సరిపోవంటే నమ్మాలి. ఈ రెండింటిని కలిపే చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. సినిమా వాళ్లు క్రికెటర్లని పెళ్లాడటంతో ఇవి రెండూ సహజీవనం చేస్తున్నాయా? అన్నట్లుగా నేడు పరిస్థితి ఉంది. సినిమా వాళ్లను సాధారణ ప్రేక్షకులు ఎలా అయితే అభిమానిస్తారో.. క్రికెటర్లను కూడా సినిమా వాళ్లు అంతకుమించి అభిమానిస్తుంటారు. ఆ విషయం తెలియంది కాదు. అన్నింటినీ మించి కొందరు క్రికెటర్లకు మాత్రం హద్దులు లేని అభిమానం సొంతం. కపిల్ దేవ్, సచిన్, ఎమ్.ఎస్. ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అభిమానించే వారికి హద్దులు, సరిహద్దులు లేనే లేవు. ప్రపంచవ్యాప్తంగా వీరికి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానం ఇప్పటికీ, ఎప్పటికీ అలానే ఉంది.. ఉంటుంది. సరేలే.. ఈ విషయం అందరికీ తెలిసిందేలే కానీ, అసలు విషయంలోకి వచ్చేద్దాం..

Also Read- Allu Ayaan: ఆర్సీబీకి తొలి కప్.. అల్లు అయాన్‌కి ఏమైంది? వీడియో వైరల్!

18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ, మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ (TATA IPL Final)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన విక్టరీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విక్టరీ కోసం ముఖ్యంగా విరాట్ కోహ్లీ, బెంగళూరు అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో.. ఒక్కసారి సోషల్ మీడియాను గమనిస్తే చాలు తెలిసిపోతుంది. 18 ఏళ్ల సంబరాలను కలిపి ఒకే సంవత్సరం చేస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంది బెంగళూరులో వెదర్. ఇంకా చెప్పాలంటే బెంగళూరుకు ముందుగానే ‘దీపావళి’ వచ్చేసిందా? అనేలా వీధులన్ని టపాసుల కాంతులతో నిండిపోయాయి. 18 సంవత్సరాల ఎమోషన్‌ని తీర్చేసుకుంటున్నారు. వాళ్లు, వీళ్లు అని కాదు.. ఇన్నేళ్లుగా ఆర్సీబీని అభిమానిస్తున్న వారిలోని భావోద్వేగాలన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. ఆ భావోద్వేగాల శాతం ఏ రేంజ్‌లో ఉందో తెలియాలంటే మాత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ మూవీ సెట్స్‌లోకి వెళ్లాల్సిందే.


Also Read- Actress Laya: బాలయ్య అంత పని చేశాడా? షాకింగ్ విషయం చెప్పిన నటి లయ!

అవును, ‘ఆర్సీబీ’ విజయంతో ‘ఎన్టీఆర్‌నీల్’ (NTRNeel) మూవీ సెట్స్‌లో దర్శకుడు ప్రశాంత్ బీభత్సమే సృష్టించారు. పంజాబ్ టీమ్ లాస్ట్ బంతి అనంతరం.. ఆర్సీబీదే కప్ అని తెలియడంతో ఈ కన్నడ దర్శకుడు ఒక్కసారిగా చిన్నపిల్లాడిగా మారిపోయారు. సెట్స్‌లో గంతులు వేస్తూ.. తన అసిస్టెంట్స్‌ని సరదాగా కొట్టడం స్టార్ట్ చేశారు. నిజంగా ఇది ఊహించనిది. ఎందుకంటే, ప్రశాంత్ నీల్ తన పేరుకి తగ్గట్టే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఆయన గంభీరమైన మాస్ చిత్రాలు తీసినప్పటికీ, మనిషిగా మాత్రం ఎప్పుడూ కూల్‌గానే కనిపిస్తూ ఉంటారు. కానీ, ఎప్పుడైతే ఆర్సీబీదే కప్ అని తేలిపోయిందో.. అప్పుడాయనలోని అపరిచితుడు బయటికి వచ్చాడు. సెట్స్‌లో అటు ఇటు గెంతులు వేస్తూ.. తనకి అడ్డొచ్చిన వారిని సరదాగా కొడుతూ.. అల్లరల్లరి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. నిజంగా కన్నడ ప్రేక్షకులు, ప్రజలు ఎంతగా ఆర్సీబీ విజయాన్ని కాంక్షిస్తున్నారనే విషయం ఈ వీడియోతో తెలిసిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు