Telugu States Issue
Politics, తెలంగాణ

Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ ఏం తేల్చుకుంటారో?

Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త పంచాయితీ నెలకొన్నది. ఈ విషయంలో అటు ఆంధ్రా సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం తేల్చుతారో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు ఈ గ్యాప్‌లోనే తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల తూటాలు ఓ రేంజిలో పేలిపోతున్నాయి. అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణ నేతలు ఎవ్వరూ ఈ విషయంలో అస్సలు తగ్గట్లేదు. దీంతో చివరికి ఏమవుతుంది? అనేదానిపై తెలుగు ప్రజల్లో ఒకింత టెన్షన్ నెలకొన్నది. ఇంతకీ ఆ పంచాయితీ ఏంటి? ఎందుకింత రాద్ధాంతం? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

అసలేంటీ వివాదం?
‘బనకచర్ల’ అనేది ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాధాన్యత ఉన్న పేరు. ఇంకా చెప్పాలంటే ప్రాంతం కంటే కూడా, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బృహత్తర నీటిపారుదల ప్రాజెక్టు కేంద్ర బిందువుగా వార్తల్లో నిలుస్తోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నది నుంచి నీటిని రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మళ్లించే లక్ష్యంతో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు రాయలసీమకు ‘గేట్ వే’ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. గోదావరి నదిలో వృథాగా సముద్రంలో కలిసే వరద జలాలను (సుమారు 200 TMC) ఉపయోగించుకొని, నీటి కొరత ఉన్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీటిని అందించడమే లక్ష్యం. తద్వారా దాదాపు 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే ఉన్న 22.59 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరుగుతున్నది. దీంతో పాటు పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీ నీటిని అందిస్తుంది. కాగా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.81 వేల కోట్లు.

Telugu States Water Fight

Read Also- KTR: అరెరే.. కేటీఆర్‌కు పెద్ద చిక్కొచ్చి పడిందే.. ఆధారాలతో దిమ్మతిరిగేలా కొట్టారుగా!

తెలంగాణ తీవ్ర అభ్యంతరం..
ఈ బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గోదావరి యాజమాన్య బోర్డు (Godavari River Management Board) అనుమతి లేకుండా, తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఇక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది తమ నీటి వాటాను ప్రభావితం చేస్తుందని తెలంగాణ వాదన. ఈ అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు కూడా పలుమార్లు లేఖలు రాసింది. అయితే అటు ఏపీ మాత్రం బనకచర్ల ప్రాజెక్టును కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది.

Read Also- Jagan Vs Lokesh: వైఎస్ జగన్ రె‘ఢీ’నా.. 10 నిమిషాలు చాలు.. మంత్రి విచిత్ర ఛాలెంజ్!

బనకచర్లను ఒప్పుకోం
వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్‌ విషయంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముందుకొచ్చి తేల్చి చెప్పారు. ‘ గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేం ఒప్పుకోబోం. బనకచర్ల జెక్ట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాజెక్టు అంశాన్ని ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఈ ప్రాజెక్ట్ నిర్మించకుండా అడ్డుకోవాలని కోరాం. ఈ ప్రాజెక్ట్‌తో కలిగే నష్టాలను, అభ్యంతరాలపై కేంద్రానికి తెలియజేశాం. ఆ క్రమంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖలు రాశాం. ఈ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తాం. సముద్రంలో కలిసే నీళ్లని వాటిని కాపాడుకునేందుకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఏపీ నేతలు ఎలా చెబుతారు? త్వరలోనే ప్రాజెక్టుపై కార్యచరణ ప్రకటిస్తాం. ఆ ప్రాజెక్టుపై సరైన సమయంలో స్పందిస్తాం’ అని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ స్పష్టం చేశారు.

Read Also- Virat Kohli Record: కోహ్లీ నా మజాకా.. వార్నర్ రికార్డు మటాష్

మొదట్నుంచీ ఇలా..

కాగా, ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేవని, ఇది నీటి పంపకాల ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ప్రభుత్వం గోదావరి యాజమాన్య బోర్డు సమావేశంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు, 1980లను ఉల్లంఘిస్తున్నదని తెలంగాణ వాదిస్తోంది. మొత్తానికి చూస్తే.. ఈ బనకచర్ల వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఫైట్‌గానే మారుతోంది. చివరికి ఏం జరుగుతుందో? అటు ఏపీ నుంచి చంద్రబాబు, ఇటు తెలంగాణ నుంచి రేవంత్ ఏం తేల్చుకుంటారో? అనేది వేచి చూడాలి మరి.

Read Also- YS Jagan: సీఎం చంద్రబాబును న‌డి రోడ్డుపై కొడ‌తారా?

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు