OP Sindoor: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్‌గా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. గత నెలలో ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గారని అన్నారు. దగ్గరదగ్గరగా 100 గంటలపాటు క్షిపణలు, వైమానిక దాడులు జరిపిన తర్వాత మోదీ లొంగిపోయారని మండిపడ్డారు. ఈ మేరకు భోపాల్ నగరంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాట్లాడారు.
‘‘డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నరేంద్ర మోదీ వెంటనే లొంగిపోయారు. చరిత్ర దీనిని ఎప్పటికీ మరచిపోదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసలు నైజం ఇదే. నరేందర్, సరెండర్ అని ట్రంప్ చెప్పగానే, యెస్ సర్.. అంటూ మోదీ లొంగిపోయారు’’ అని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read this, Phone Tapping: సంచలన మలుపు తిరగనున్న ఫోన్ట్యాపింగ్కేసు!
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ పడగొట్టిందని, నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అమెరికా నుంచి హెచ్చరికలు వచ్చినా లెక్కచేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆడ, మగ సింహాలు ఆధిపత్య దేశాలను సైతం ఎదురించాయని, ఎవరికీ తలవొంచలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘బీజేపీ, ఆర్‌ఎస్సెస్ వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. కొద్దిగా ఒత్తిడి చేస్తే చాలు భయంతో పారిపోతారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read this, Jagan Vs Lokesh: వైఎస్ జగన్ రె‘ఢీ’నా.. 10 నిమిషాలు చాలు.. మంత్రి విచిత్ర ఛాలెంజ్!
ఖండించిన బీజేపీ
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అధికార బీజేపీ ఖండించింది. పార్టీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా వెంటనే స్పందించారు. రాహుల్ గాంధీ మాటలు చూస్తుంటే పాకిస్థాన్ ఐఎస్ఐకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా అనిపిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టి్స్తున్నారని సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు.