KTR: సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడు ఏ విషయం, ఎలాంటి వీడియోలు ట్రెండ్ అవుతాయో ఊహించలేం. అవన్నీ పాత విషయాలు, ప్రస్తుతం జరుగుతున్నావా? అనేది పక్కనెడితే ఒక్కసారి వైరల్ అవ్వడం మొదలైతే.. ఆ వ్యవహారం ఎటు నుంచి ఎటు పోతుందో కూడా కనీసం ఊహించుకోలేం. ఒకరిద్దరు, ఒక గ్రూప్ ట్రెండ్ సెట్ చేయడం మొదలుపెట్టారో ఇక మోత మోగిపోతుంది అంతే. ఎందుకంటే సోషల్ మీడియా పవర్ అలాంటిది మరి. ఈ మధ్యనే దివంగత నటుడు, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గురించి రాజేంద్రప్రసాద్, ఇంకొందరికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాద్యమాలను షేక్ చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కొన్ని ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణాలేంటి? ఎందుకు ఇంతలా వైరల్ అవుతున్నాయి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
ఇదీ అసలు సంగతి..!
ఎన్టీఆర్ (NTR) వంద బజ్జీలు తినేవారని, డజన్ సోడాలు తాగేవారని నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) చెప్పిన మాటలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలను బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Activists) కొందరు తెగ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా కేటీఆర్ అభిమానులు (KTR Fans) అయితే ఒకింత మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని రీతిలో తిట్టిపోసేశారు కూడా. ఇదంతా బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ (BRS Vs TDP) కార్యకర్తలుగా సీన్ మారడంతో జరిగింది. ఓరి బాబోయ్.. ‘మీరు ఎవర్నయితే తిడుతున్నారో మీ అభిమాన కేటీఆర్ గురించి అసలు విషయాలు మీకు తెలుసా?’, ఎన్టీఆర్ పుణ్యామా? అని కేటీఆర్ పేరు పెట్టుకున్నారని ఇవన్నీ తెలియకుండా ఏది పడితే, అది వాగడం ఎందుకు? అంటూ పాత ఇంటర్వ్యూలు అన్నీ టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ తెగ వైరల్ చేయడం, అంతకుమించి దిమ్మదిరిగిపోయేలా కౌంటర్లు ఇచ్చిపడేస్తున్నారు. దీంతో గత 24 గంటలుగా అటు ఎన్టీఆర్.. ఇటు కేటీఆర్ ఇద్దరి గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందుకు కౌంటర్‌గా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తామేం తక్కువ కాదని.. అస్సలు కేటీఆర్ పేరుకు.. ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధాల్లేవని ఓ ఇంటర్వ్యూను ట్రెండ్ చేస్తున్నారు. దీనిపైన కూడా టీడీపీ కౌంటర్ షురూ చేసింది.
Read Also- గొడవ మొదలైంది ఇక్కడే.. Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!
ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు?
కేటీఆర్.. (కల్వకుంట్ల తారక రామారావు) మీ పేరుకు ప్రత్యేకత ఏంటి? అని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి మాజీ మంత్రి స్పందిస్తూ చాలా లాజిక్‌గానే బదులిచ్చారు. ‘ నా పేరుకు ప్రత్యేకత అంటూ ఏమీ లేదండీ. చాలా మంది అడుగుతుంటారు. అంతకుముందు మీ ఫాదర్ తెలుగుదేశంలో ఉన్నారు కదా..? ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టారా? అని అంటుంటారు. అందుకే ఈ విషయంపైన క్లారిటీ ఇద్దాం అని అనుకుంటున్నాను. నేను 1976లో పుట్టాను. అప్పటికి ఇంకా ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాలేదు. 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఆయనకు, ఆయన వల్ల ప్రేరణ పొంది పెట్టిన పేరు అయితే నాది కాదు. జన్మ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది కదా..? దాన్ని లింక్ చేసుకొని మా తాతగారు పెట్టిన పేరు. మా నాన్న గారు కూడా పెట్టిన పేరు కాదు. తాత గారు పెట్టిన పేరు కాబట్టి, ఎన్టీఆర్ గారికి, నా పేరుకు ఎలాంటి సంబంధం లేదు అనుకుంటున్నా (నవ్వుతూ). అయితే తారక రామారావు అనే పేరు ఉండటం మాత్రం మంచిదే అనుకుంటున్నాను. నాన్న గారికి ఎన్టీఆర్ గారంటే అభిమానం ఉంది.. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అభిమానం మాత్రమే కాదు, గౌరవం కూడా. నాన్న గారి రాజకీయ జీవితాన్ని ఒక దశకు తీసుకొచ్చింది కూడా ఆయనే కాబట్టి చాలా గౌరవం. ఫైనల్‌గా నా పేరుకు, ఎన్టీఆర్ గారి పేరుకు ఎలాంటి లింక్ లేదు’ అని అప్పట్లోనే కేటీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Read Also- Jagan Vs Lokesh: వైఎస్ జగన్ రె‘ఢీ’నా.. 10 నిమిషాలు చాలు.. మంత్రి విచిత్ర ఛాలెంజ్!
ఉండొచ్చు కానీ..?
మరో ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ మాటలకు పూర్తి విరుద్ధంగా మాట్లాడేశారు. ‘ ఎన్టీ రామారావు గారిని చూసేవాడినే కానీ, నాకు పెద్దగా తెలియదు. నేను చిన్నవాడిని కాబట్టి తెలియదు. ఇక పేరు విషయానికొస్తే.. నా పేరు పెట్టినప్పుడు మా నాన్న అస్సలు లేరు. శ్రవణ నక్షత్రంలో పుట్టానని చెప్పి, మా తాత గారు (మా నాన్న తండ్రి, అమ్మ తండ్రి) కరీంనగర్‌లో (Karimnagar) బారసాల చేస్తే అక్కడ మా తాతలు ఇద్దరూ అనుకొని పండితులు చెప్పినట్లుగా పేరు పెట్టారు. శ్రవణ నక్షత్రం రాముడు.. రాముడిలో పట్టాభి రాముడు, తారక రాముడు, జానకీ రాముడు, సీతా రాముడు రకరకాలుగా ఉంటారు కదా? సో.. వాళ్లు ఏదో అనుకొని నాకు పేరు పెట్టారు. మా తాతలు ఇద్దరిలో ఎవరు ఎన్టీఆర్ గారి అభిమానో నాకు తెలియదు. ఒకవేళ అభిమాని అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు సుప్రీం. ఏదైతేనేం ఒక మంచి వ్యక్తి పేరు నాకు పెట్టారు. అంతవరకూ సంతోషం. సడన్‌గా వేరే ఇంకో పేరు పెట్టి ఉంటే కష్టమయ్యేదేమో? (నవ్వుతూ)’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. చూశారుగా.. అసలు ఇవన్నీ పాత విషయాలు అయినప్పటికీ చిన్న ట్రోలింగ్‌తో కేటీఆర్ అభిమానులను టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ ఆధారాలు చూపించి మరీ ఏ రేంజిలో కడిగి పారేస్తున్నారో..! ఇదీ అసలు సంగతి.
Read Also- KTR – Kavitha: కేటీఆర్ వస్తేనే క్లారిటీ.. కవిత ఎపిసోడ్ పై చర్చించే అవకాశం!
వీడియోలు ఇక్కడ చూసేయండి..
నాకు పేరు పెట్టింది మా తాత – కేటీఆర్ గారు
నేను పుట్టింది 1976 లో, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1982 లో, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకన్న ముందే నేను పుట్టను. ఎన్టీఆర్ పేరుకి నా పేరుకి సంబంధం లేదు.
Inkosari ruddithe cheppu tegudhii @gayatri008_16. https://t.co/E3hv5Pv8dn pic.twitter.com/bsXU37hJ85
— Antara (@AntaraonX) June 3, 2025
మా తాతలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవ్వడం వల్ల ఆ పేరు పెట్టి ఉండొచ్చు
అలాంటి మంచి వ్యక్తి పేరు పెట్టడం సంతోషం : కేటీఆర్
ఎంత రుద్దినా నిజం దాగదు https://t.co/fLdlf2teno pic.twitter.com/yI03Kn6BUs
— TDP Germany 🇮🇳 (@TDP_Germany) June 3, 2025
Read Also- Nagarjuna: 45 ఏళ్లు వచ్చినా నాగ్ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదేం?