RCB Fan (Image Source: Twitter)
Viral

RCB Fan: కప్ కోసం ఎంతకు తెగించార్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్ పనికి అవాక్కవాల్సిందే!

RCB Fan: ఐపీఎల్‌ 2025 (IPL 2025)లో ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ జరగనున్నసంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తుది పోరు మెుదలు కానుంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడంతో ఈసారి ఎలాగైన కప్ (IPL Trophy 2025) సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. అయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్ (RCB Fans) ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సీజన్ లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న తమ జట్టుకు దిష్టి తగలకుండా ఓ అభిమాని గట్టి ప్లానే వేశాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

యాంటి నజర్ స్క్వాడ్!
ఆర్సీబీ ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగళూరులో ఓ ఫ్యాన్ చేసిన పని సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. తమ అభిమాన జట్టుకు ఎలాంటి దిష్టి తగలకుండా.. ఫైనల్ లో అద్భుతమైన విజయం సాధించాలని కోరుతూ ఓ వ్యక్తి తన కారు చుట్టూ దిష్టి నిమ్మకాయలు తగిలించారు. యాంటి నజర్ స్క్వాడ్ పేరుతో ఆ వాహనాన్ని తీర్చిదిద్దారు. టోర్నీలో ఇప్పటివరకూ ఆర్‌సీబీ అద్భుతమ ప్రదర్శన చేస్తూ వచ్చింది. పైగా విరాట్ (Virat Kohli) సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో అందరూ ఆర్‌సీబీనే గెలుస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీకి దిష్టితగిలి ఫలితం మరోలా రాకుడదన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారు యజమాని చెబుతున్నారు.

నెటిజన్లు ఫన్నీ కామెంట్స్
అయితే ఆర్‌సీబీ అభిమాని చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు. ఇదేం అభిమానంరా అయ్యా అంటూ  నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అభిమానంలో కొత్త ట్రెండ్ సృష్టించేస్తున్నారుగా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తమకు కూడా బెంగళూరు జట్టే గెలవాలని కోరికగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 18 ఏళ్ల నిరీక్షణకు ఇవాళ చెక్ పడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ (RCB Fans) కు ఆల్ ది బెస్ట్ అంటూ పలువురు తమ మద్దతు తెలియజేస్తున్నారు.

Also Read: IPL Final Closing Ceremony: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఈసారి ముగింపు వేడుకలు ధూమ్ ధామే!

గెలుపు అవకాశాలు బెంగళూరుకే!
పంజాబ్ తో పోలిస్తే బెంగళూరు జట్టుకు ఫైనల్స్ లో కాస్త అడ్వాంటేజ్ ఉండొచ్చని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోహ్లీ (Virat Kohli), సాల్ట్ (Phil Salt) లాంటి బ్యాటర్ల ఫామ్.. హజెల్‌వుడ్ (Josh Hazlewood), సుయాష్ (Suyash Sharma), భువనేశ్వర్ (Bhavaneswar Kumar) బౌలింగ్ త్రయం ఆ జట్టుకు కలిసి రావొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పంజాబ్ విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఫామ్, చాహల్ స్పిన్ మాయాజాలం, అహ్మదాబాద్ పిచ్‌పై అనుభవం కారణంగా పంజాబ్ సైతం పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే బెంగళూరు జట్టుకు 60% శాతం మేర గెలుపు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా అని శ్రేయాస్ నాయకత్వంలోని పంజాబ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే బెంగళూరుకు షాక్ తప్పదని సూచిస్తున్నారు.

Also Read This: ipl final 2025: ఒకే ఒక్కడు.. ఫైనల్ వేళ అందరి దృష్టి అతడి పైనే!

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!