Bhatti Vikramarka: ఇది గొప్ప ఆశయంతో చేపట్టిన కార్యక్రమం.
Bhatti Vikramarka (imagrcredit:twitter)
నార్త్ తెలంగాణ

Bhatti Vikramarka: ఇది గొప్ప ఆశయంతో చేపట్టిన కార్యక్రమం.. భట్టి విక్రమార్క!

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా ఇందిరా డెయిరీ నియోజకవర్గంలో గొప్ప ఆశయంతో చేపట్టిన కార్యక్రమం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేసే ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మధిర క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్, drdo పిడి సన్యాసయ్య, వెలుగు, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరా డెయిరీ పథకంలో ప్రతి లబ్ధిదారునికి రెండు గేదెలు అందజేయాలని, సభ్యులు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంట్రిబ్యూషన్ కు సంబంధించి సభ్యులకు అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇందిరా డెయిరీ సభ్యులకు భూమి ఉండాలన్న నిబంధన ఏదీ లేదని, అసలు గేదెలు లేనివారికి ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

Also Read: GHMC officials: గట్టిగా వాన పడితే ఆగమాగమే.. టెండర్ల రద్దుకు అసలు కారణాలు ఇవేనా?

ఇందిరా డెయిరీ పథకం

రానున్న ఐదు నెలల లోపు నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఇందిరా డెయిరీ పథకం ప్రారంభం కావాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనులు వేగవంత చేసేందుకు గేదెల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో అధికారుల బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ముజిమిల్ ఖాన్ ను ఆదేశించారు. గేదెల కొనుగోలు బృందంలో తప్పనిసరిగా ఒక విజిలెన్స్ అధికారి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న గేదెలు, కొత్తగా రాబోతున్న గేదెలు వాటికి అవసరమైన పచ్చి గడ్డి, ఎండు గడ్డి వివరాల సమీక్ష నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గడ్డి అవసరం ఉన్న నేపథ్యంలో నిరుద్యోగులకు గడ్డి సరఫరాకు అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపట్టి వారికి ఉపాధితో పాటు పెద్ద సంఖ్యలో వస్తున్న గేదెలకు గడ్డిని సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజిమిల్ ఖాన్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Also Read: GHMC R V Karnan: వివాదాస్పదం కానున్న.. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్!

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..