GHMC R V Karnan: కోటిన్నర మంది హైదరాబాద్ నగరవాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ బాస్, కమిషనర్ గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించటంలో ఆర్. వి. కర్ణన్ విఫలమయ్యారన్న విమర్శ వెల్లువెత్తుతుంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి కమిషనర్ గా విధులు నిర్వర్తించిన లోకేశ్ కుమార్ మొదలుకుని ఆ తర్వాత వచ్చిన అమ్రపాలి, రోనాల్డ్ రోస్, ఇలంబర్తి వంటి అధికారులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కనీసం మూడు నెలల పాటు అబ్జర్వేషన్ పీరియడ్ గా పెట్టుకుని, ఆ తర్వాత నెమ్మదిగా తమదైన పాలన అందించే దిశగా నిర్ణయాలు తీసుకునే వారు. కానీ ఇటీవలే కొత్తగా కమిష నర్ గా వచ్చిన ఆర్. వి. కర్ణన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ అబాసుపాలవుతున్నారన్న విమర్శ వెల్లువెత్తుతుంది.
29 ఏప్రిల్ నాడు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కర్ణన్, పలు యూనియన్ల మధ్య సైలెంట్ వార్ మొదలైనట్లు సమాచారం. కమినర్ గా వచ్చి, కనీసం నెలన్నర రోజుల కూడా జీహెచ్ఎంసీ కార్యకలాపాలు, అధికారుల వ్యవహార శైలి వంటి అంశాలను పరిశీలించకుండానే తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. గ్రేటర్ లో అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించాలంటూ ఆయన చేసిన ప్రయత్నం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వర్షాకాలం సహాయక చర్యల నిమిత్తం రూ.50 కోట్లతో చేపట్టిన వాహానాల ఎంగేజీ టెండర్లలో భారీగా గోల్ మాల్ జరగటం, అది కాస్త బట్టబయలై చివరకు టెండర్ల ప్రక్రియను రద్దు కావటం కమిషనర్ విధి నిర్వహణ వైఫల్యాలుగా చెప్పవచ్చు.
Also Read: Kaleshwaram Vigilance Report: కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. వారిపై క్రిమినల్ చర్యలు!
దూరం పెంచనున్న ఎఫ్ఆర్ఎస్
జోన్లు, సర్కిళ్లలోనే పర్మినెంట్ ఉద్యోగులకు కూడా పేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్ ) అమలు చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలు కూడా వివాదాస్పదమవుతునాయి. ఈ విషయంలో తనను కలిసిన పలు యూనినయన్ల నేతలను ఉద్దేశించి ఇంట్లో కూర్చొనే వారికి జీతాలివ్వమంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కమిషనర్, జీహెచ్ఎంసీలోని ఉద్యోగ,కార్మిక యూనియన్ల మధ్య దూరాన్ని పెంచేలా మారనుంది. ఇంట్లో కూర్చొనే వారికి జీతాలిచ్చేది లేదన్న కమిషనర్ వ్యాఖ్యలను పలు యూనియన్లు తప్పుబడుతున్నాయి.
ఉద్యోగానికి రాకుండా, ఇంట్లో కూర్చునే వారిని గుర్తించి కమిషనర్ వారిని డిస్మిస్ చేయాలే తప్పా, ఎలాంటి విచారణలు లేకుండా, ఎవరు పని చేస్తున్నదీ, ఎవరు విధులను ఎగ్గొడుతున్నది కమిషనర్ గుర్తించి సరైన చర్యలు తీసుకోవాలే తప్పా, ఎక్కువ ఫీల్డు లెవెల్ లో విధులు నిర్వర్తిస్తూ, రిటైర్డ్ మెంట్ కు దగ్గర్లో ఉన్న శానిటరీ జవాన్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ను మినహాయించాలని కోరితే కమిషనర్ చేసిన వ్యాఖ్యలను యూనియన్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ పరిణామంపై త్వరలోనే ఆందోళనలు చేపట్టేందుకు పలు యూనియన్లు సిద్దమవుతున్నట్లు సమాచారం.
Also Read: Complaints To Hydraa: నాలాల ఆక్రమణలపై ..హైడ్రాకు ఫిర్యాదులు!
రాంకీ, సీఆర్ఎంపీకి బల్దియా మ్యాన్ పవర్, మిషనరీ ఎలా వాడుతారు?
సిటీలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ, ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు చెత్త తరలింపు వంటి విధులను కాంట్రాక్టు తీసుకున్న రాంకీ చేయాల్సిన పనులను జీహెచ్ఎంసీ మ్యాన్ పవర్, మిషనరీతో చేయిస్తుండటం కమిషనర్ కు కన్పించటం లేదా? అని కొందరు యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. రాంకీకి ఫవర్ గా పని చేయాలంటూ మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు తీసుకువస్తున్న వత్తిడిని వ్యతిరేకిస్తున్నందుకే శానిటరీ జవాన్లపై ఎఫ్ఆర్ఎస్ అమలు చేసేందుకు కమిషనర్ సిద్దమైనట్లు కూడా తాము భావిస్తున్నామని యూనియన్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయలు తీసుకుంటున్న రాంకీ చెత్త విధులు, కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటనెన్స్ ప్రొగ్రాం (సీఆర్ఎంపీ) ఏటా రూ. వంద కోట్ల బిల్లులు తీసుకుంటున్నా, సీఆర్ఎంపీకి కేటాయించిన రోడ్లపై జీహెచ్ఎంసీ స్వీపింగ్ మిషన్లు ఎందుకు పని చేస్తున్నాయో? కమిషనర్ విచారించాలని యూనియన్ నేతలు పట్టుబడుతున్నారు. తాజాగా వర్షాకాలం సహాయక చర్యల కోసం ఏర్పాటు చేయాల్సిన టీమ్ లకు సమకూర్చాల్సిన వాహానాల టెండర్లలో కూడా గోల్ మాల్ జరగటం, ఆ విషయం బయట పడటంతో కమిషనర్ చల్లగా టెండర్ల ను రద్దు చేసి తప్పించుకున్నారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రతి వర్షాకాలం లో ఎమర్జెన్సీ బృందాలకు కేటాయించాల్సిన వాహానానికి కేవలం రూ.30 వేలు నెలసరి అద్దెను చెల్లిస్తుండగా, ఈ సారి నెలకు రూ. 63 వేల అద్దెకు ఇసుజు వాహానాలను ఎంగేజ్ చేసి, బల్దియా ఖజానాపై అదనపు ఆర్థిక భారం వేయాలన్న ఆలోచన ఎవరిదీ? కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజనీర్లు ఎవరు? ఖజానాకు కన్నం వేయాలన్న ప్రయత్నం ఎవరిదీ? అనే అంశాలపై విచారణ చేపట్టి, నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ దే నని యూనియన్ నేతలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Also Read: Anudeep Durishetty: నిధులిచ్చాం పనులెందుకు చేయలే?.. అధికారులపై కలెక్టర్ అనుదీప్ ఫైర్!