Jagga Reddy: పదేళ్లు మెదక్ ఎంపీగా ఉండి ఏం చేశావ్? అంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడే పర్సనాలిటీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ దికాదన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ వద్ద అంటెడర్ పోస్టు లాగా పనిచేశాడని విమర్శించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంటే గతంలో ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ అయ్యారు.
Also Read: Kodanda Reddy: సత్వర చర్యలు తీసుకోవాలని.. అధికారులకు కోదండరెడ్డి ఆదేశం!
మెదక్ ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావో ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. బీఆర్ ఎస్ లోని అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దుకోవాలని సూచించారు. ఇక పాకిస్తాన్ నుండి కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడి 26 మందిని కాల్చి చంపే వరకు బీజేపీ ప్రభుత్వానికి సోయి లేదని మండిపడ్డారు. తప్పులు చేసి రాహల్ గాంధీని విమర్శించడం ఏమిటని? నిలదీశారు. పాకిస్థాన్ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ట్రంప్ చెబితే యుద్ధం ఆపడమేమిటని.? ప్రశ్నించారు. ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతోనే ఉగ్రవాదం వచ్చిందని వివరించారు. యుద్దం చేసి ఉంటే పాకిస్థాన్ పూర్తిగా ఓడిపోయి ఉండేదని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ తదితరులు ఉన్నారు.
Also Read: Raja Singh: రాజాసింగ్ పై చర్యలు.. జాతీయ పార్టీ నుంచి స్టేట్ యూనిట్ కు ఆదేశాలు!