IPL 2025 Final (Image Source: Twitter)
స్పోర్ట్స్

IPL 2025 Final: మరికొద్ది గంటల్లో ఫైనల్స్.. గెలిచేదెవరు.. ఇంటికెళ్లేది ఎవరు..?

IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) – పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగే మ్యాచ్ తో సీజన్ విజేత ఎవరో తెలిపోనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మెుదలు కానుంది. అయితే ఫైనల్లో తలపడే బెంగళూరు (RCB), పంజాబ్ (PBKS) జట్టు ఇంతవరకూ కప్ గెలవకపోవడంతో పోరు మరింత రసవత్తవరంగా సాగే అవకాశముంది. అయితే టైటిల్ పోరులో తమదంటే తమదే విజయమని రెండు జట్ల అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? మ్యాచ్ లో ఏ జట్టు పై చేయి సాధించే ఛాన్స్ ఉంది? ఆట దశా దిశా మార్చే ప్లేయర్ ఎవరు అవుతారు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

ఆర్‌సీబీ బలాబలాలు..
బెంగళూరు జట్టు బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ (608 రన్స్, స్ట్రైక్ రేట్ 147.91) ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతని అనుభవం, ఒత్తిడిలో ఆడగల సామర్థ్యం ఆర్‌సీబీకి పెద్ద అస్త్రంగా మారగలదు. అలాగే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 రన్స్, క్వాలిఫయర్ 1లో) ఛేజింగ్ లో దూకుడుగా ఆడగలడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో పరుగుల వరద పారించగలడు. అటు రజత్ పటీదార్ మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు మధ్య ఓవర్లలో స్థిరత్వాన్ని తీసుకొచ్చి జట్టు మంచి స్కోరు సాధించడంతో తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే జోష్ హజెల్‌వుడ్ (క్వాలిఫయర్ 1లో 3/21) తన స్వింగ్, సీమ్ తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌ను క్వాలిఫయర్ 1లో కుప్పకూల్చాడు. సుయాష్ శర్మ (3/17, క్వాలిఫయర్ 1) స్పిన్ బౌలింగ్‌లో తన గూగ్లీతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. భువనేశ్వర్ కుమార్ (181 ఐపీఎల్ వికెట్లు), యష్ దయాళ్ పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.

ఫైనల్ అనుభవాలు..
ఐపీఎల్ లో ఇప్పటివరకూ 3సార్లు ఆర్సీబీ ఫైనల్ మ్యాచులు ఆడింది. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్స్ లో తలపడింది. అయితే మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమే ట్రోఫీని మిస్ చేసుకుంది. ఈ సీజన్ లో నాల్గోసారి ఫైనల్ చేరడంతో.. గత అనుభవాలు ఆర్సీబీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొనే అనుభవం జట్టులోని కీలక ఆటగాళ్లకు ఉంది. ఆర్‌సీబీ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు (సాల్ట్, క్రునాల్ పాండ్యా, హజెల్‌వుడ్, భువనేశ్వర్, దయాళ్, సుయాష్) గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనుభవం కలిగి ఉన్నారు. క్వాలిఫయర్ 1లో పంజాబ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

పంజాబ్ జట్టు బలాబలాలు
పంజాబ్ జట్టు బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (514 రన్స్, స్ట్రైక్ రేట్ 171.90) ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) పై అజేయ 87 రన్స్ చేశాడు. నేహల్ వదేరా, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు ఈ సీజన్‌లో స్థిరంగా రాణించడం ఆ జట్టుకు ప్రధాన అడ్వాంటేజ్. మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి ఆల్ రౌండర్లతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ గా ఉంది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra chahal).. ప్రధాన అస్త్రం కాగలడు. గతంలో అతడు ఆర్సీబీ తరపున ఆడిన అనుభవం పంజాబ్ కు కలిసివచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా శ్రేయాస్ నాయకత్వంపై ఆ జట్టు చాలా ధీమాగా ఉంది. ఫైనల్ జరుగుతున్న అహ్మాదాబాద్ లో ఆ జట్టు ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లు ఆడగా.. ఆ రెండింటిలోనూ విజయం సాధించడం విశేషం.

Also Read: Gold Rate ( 03-06-2025) : బిగ్ షాక్.. ఈ రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

ఏ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉంది?
పంజాబ్ తో పోలిస్తే బెంగళూరు జట్టుకు ఫైనల్స్ లో కాస్త అడ్వాంటేజ్ ఉండొచ్చని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోహ్లీ (Virat Kohli), సాల్ట్ (Phil Salt) లాంటి బ్యాటర్ల ఫామ్.. హజెల్‌వుడ్, సుయాష్, భువనేశ్వర్  బౌలింగ్ త్రయం ఆ జట్టుకు కలిసి రావొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పంజాబ్ విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్ ఫామ్, చాహల్ స్పిన్ మాయాజాలం, అహ్మదాబాద్ పిచ్‌పై అనుభవం కారణంగా పంజాబ్ సైతం పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే బెంగళూరు జట్టుకు 60% శాతం మేర గెలుపు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా అని శ్రేయాస్ నాయకత్వంలోని పంజాబ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే బెంగళూరుకు షాక్ తప్పదని సూచిస్తున్నారు.

Also Read This: Chamala Kiran Kumar Reddy: ఇంట్లో ఈటెల రాజేందర్ రెడ్డి.. గేట్ బయట ఓబీసీ నాయకుడు!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు