Drug Peddlers Arrested( image credit: free pic or twiitter)
హైదరాబాద్

Drug Peddlers Arrested: డ్రగ్స్ ముఠా అరెస్ట్​.. కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు సీజ్!

Drug Peddlers Arrested: పక్కగా సేకరించిన సమాచారంతో కూకట్ పల్లి ఎస్వోటీ అధికారులు కూకట్ పల్లి పోలీసులతో కలిసి డ్రగ్స్​ దందా చేస్తున్న ముఠాలోని అయిదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8‌‌‌‌00 గ్రాముల ఎపిడ్రిన్ తోపాటు హెరాయిన్​, అయిదు మొబైల్​ ఫోన్లు, 5‌‌0వేల రూపాయల నగదును సీజ్​ చేశారు. కాగా, ఈ గ్యాంగులో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ సభ్యునిగా ఉన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం అద్దంకి ప్రాంతానికి చెందిన ముఠా కొంతకాలంగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను హైదరాబాద్​ తీసుకొస్తూ కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీ పరిసరాల్లో విక్రయిస్తోంది.

ఈ వ్యవహారం గురించి తెలియటంతో కూకట్​ పల్లి ఎస్వోటీ అధికారులు గ్యాంగ్ కదలికలపై కొన్ని రోజులుగా కన్నేసి పెట్టారు. ముఠా సభ్యులు డ్రగ్స్​ తో వివేకానందనగర్ కాలనీకి వచ్చినట్టు తెలుసుకుని కూకట్​ పల్లి పోలీసులతో కలిసి దాడి చేశారు. అయిదుగురిని అరెస్ట్​ చేసి వారి నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం తిరుపతిలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తి కూడా ఈ గ్యాంగ్ సభ్యుడు. పోలీసుల దాడిని పసిగట్టిన సదరు కానిస్టేబుల్ తప్పించుకుని ఉడాయించాడు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​ విలువ దాదాపు 2కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.

Also ReadPhone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు రీ ఎంట్రీ!

నైజీరియన్​ అరెస్ట్…2కోట్ల విలువ చేసే డ్రగ్స్​ సీజ్​
ఇక, యాంటీ నార్కొటిక్​ బ్యూరో అధికారులు నైజీరియా దేశానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి దాదాపు 2కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్​ ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయెల్​ అనే వ్యక్తి చదువుకోవటానికంటూ కొన్ని సంవత్సరాల క్రితం స్టూడెంట్ వీసాపై భారత్ కు వచ్చాడు.

పాస్​ పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉండిపోయిన ఇమ్మాన్యుయెల్​ వస్త్రాల ఎగుమతి, దిగుమతి వ్యాపారం పేర డ్రగ్స్ దందాకు తెర లేపాడు. కొకైన్​, ఎండీఎంఏ డ్రగ్స్​ తెప్పిస్తూ హైదరాబాద్​ లో అమ్ముతున్నాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన యాంటీ నార్కొటిక్​ బ్యూరో అధికారులు సోమవారం ఇమ్మాన్యుయెల్​ ను సికింద్రాబాద్​ ప్రాంతంలో అరెస్ట్​ చేశారు. అతని నుంచి 150 గ్రాముల కొకైన్​ తోపాటు ఎండీఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 2 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Also ReadMadhu Yashki On Kavitha: జాగృతిలో భారీ స్కామ్.. రూ.800 కోట్లు హాంఫట్.. కవితపై ఆరోపణలు!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..