Nadendla Manohar
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Mid Day Meals: ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. జూన్ 12 నుంచి అమలు

Mid Day Meals: పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. జూన్ 12 నుంచి రాష్ట్రంలోని 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్‌కు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో.. ఆయన చేతుల మీదుగానే పాఠశాలు, సంక్షేమ హాస్టల్స్‌కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యతని తెలిపారు. సోమవారం అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం కొడాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా తోట కనకదుర్గ రాజశేఖర్, వైస్ చైర్మన్‌గా అత్తలూరి గోపిచంద్, డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి నాదెండ్ల హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ ‘సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం పథకం’ అని ప్రకటన చేశారు. మూడు పార్టీల కలయికతో బలంగా ఉన్న మార్కెట్ యార్డ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో వీరంతా కలసి, యార్డును మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

Read Also- Sharmishta Panoli: ఒకే ఒక్క ట్వీట్‌తో జైలుపాలు.. ఎవరీ శర్మిష్ఠ పనోలి.. ఎందుకింత రచ్చ?

రైతన్న కోసం పల్లె పండగ..
అకాల వర్షాలు, వరస ప్రకృతి విపత్తులతో ఈ ప్రాంత రైతాంగం ఎంతలా నష్టపోయిందో కళ్లారా చూశాం. రోడ్లపై ధాన్యాన్ని రాశులుగా పోసి కన్నీరు కార్చిన సందర్భాలు కోకొల్లలు. అన్నదాతల్లో ధైర్యం నింపడానికి ఆ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో పర్యటించారు. తక్షణ నష్టపరిహారం రైతులకు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినా వైసీపీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఎంతలా వేధించిందంటే, వారికి అనుకూలమైన మిల్లులకే ధాన్యం అమ్మాలని రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వందల కిలో మీటర్లు దూరంలో ఉన్నా అక్కడికే వెళ్లి ఇవ్వాలని ఇబ్బందిపెట్టేవారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి నెలలు, సంవత్సరాల తరబడి డబ్బులు చెల్లించేవారు కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదని రైతు సహాయక కేంద్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వ్యవసాయ సిబ్బందిని క్షేత్ర స్థాయికి పంపించి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయాన్ని సాంకేతికతో అనుసంధానం చేసి దిగుబడి పెంచుతున్నాం. కాలువలను ఆధునీకరిస్తున్నాం. ఈ ఏడాది ప్రకృతి కూడా సహకరించడంతో 34 బస్తాలు పండించే రైతులు 60 బస్తాలు పండించారు. గ్రామాల అభివృద్ధి కోసం పల్లెపండుగ వంటి కార్యక్రమం తీసుకొచ్చాం. అలాంటి కార్యక్రమమే రైతుల కోసం తీసుకొస్తాం అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Mid Day Meals

రూ.10 లక్షల కోట్ల అప్పులు
రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం సంక్షేమం పేరిట గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసింది. దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా ఖరీఫ్, రబీలో కలిపి దాదాపు 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దానికి సంబంధించి రూ. 12,400 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ వేశాం. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిగిలిన ధాన్యాన్ని కోనసీమ, ఏలూరు నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకున్నాం. రైస్ మిల్లులకు రూ.470 కోట్లు బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం రూ.360 కోట్లు చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వారిని భాగస్వాములు చేశాం. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని రైతాంగం ఆందోళన చెందుతుంటే 5 కోట్ల 13 లక్షల గోతాలు ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రైతులు ఏ మిల్లుకు అమ్ముకోవాలంటే ఆ మిల్లుకు అమ్ముకునేలా వెసులుబాటు కల్పించాం. వాట్సప్ ద్వారా ధాన్యాన్ని అమ్ముకునేలా సాంకేతికను తీసుకొచ్చాం అని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.

Nadendla Manohar

పారదర్శకత కోసమే..
ఇంటింటికీ రేషన్ పేరిట వైసీపీ ప్రభుత్వం రూ.1650 కోట్లతో 9360 ఎండీయూ వాహనాలు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలుగలేదు. ఎండీయూ వాహనాలు ఎప్పుడు ఎక్కడికి వస్తాయో ఎవరికీ సరైనా సమాచారం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నాం. ప్రతినెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయి. ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేస్తాం. ఆ సమయంలో ఎప్పుడైనా లబ్ధిదారులు రేషన్‌ తీసుకునే వీలుంటుంది. గతంలో వలే వాహనం కోసం పనులు మానుకుని ఇళ్ల వద్దే ఉండాల్సిన అవసరం లేదు. వీలున్న సమయంలో రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లి సరకులు తెచ్చుకోవచ్చు. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిచేలా చర్యలు తీసుకున్నాం అని నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు.

Read Also- KCR: కాళేశ్వరం విచారణకు సమయం కోరిన కేసీఆర్.. పెద్ద ప్లానే ఉందే!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు