SP On Farmers: రైతులను అన్ని రకాల వ్యాపారస్తులు ముంచుతూనే ఉన్నారు. అమాయక రైతులు వారి బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకున్న రైతులకు నకిలీ విత్తనాలు, నకిలీ రసాయనిక ఎరువులను సరఫరా చేస్తూ వారి ఆర్థిక లావాదేవీల పై దెబ్బకొడుతూ తీరని నష్టాలను కలిగిస్తున్నారు. అక్రమార్కులను అరికట్టడంలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోని ఈ అక్రమ వ్యాపారాలు జిల్లాలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా 220 బస్తాలను ఆ పరిసర ప్రాంత రైతులకు, ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయించేందుకు అక్రమార్కలు ప్రణాళిక రచించుకున్నారు.
ఈ క్రమంలోనే తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 220 బస్తాలు ఉండగా సుమారుగా (66) క్వింటాళ్ల రూ.4.75 లక్షలు విలువగల జీలుగు విత్తనాలు తొర్రూరు పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. తొర్రూరు పట్టణానికి చెందిన చలువది ఉపేందర్, జనగాం జిల్లా తరిగొప్పుల మండల ఆగ్రో రైతు సేవ కేంద్రం సురేష్ , బచ్చన్నపేట ఆగ్రోస్ సేవా కేంద్రం శ్రీనివాసరెడ్డి పై ఇద్దరు వద్ద నుంచి అక్రమంగా జీలుగు విత్తనాల బస్తాలను జనగామ నుండి ఆంధ్రాకు తరలించే తొర్రూరు పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున చలువాది ఉపేందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సదరు విత్తనాల బస్తాలను మారుస్తుండగా పోలీసులు సీజ్ చేసి విచారణ చేశారు. మొత్తం 66 క్వింటాల జీలుగు విత్తనాలను స్వాధీనం చేసుకుందామన్నారు. వీటి విలువ సుమారు రూ.4.75 విలువ ఉంటుందని ఎస్పి తెలిపారు. కాగా, జీలుగు విత్తనాల రవాణాకు వినియోగించిన రెండు బొల్లేరో వాహనాలను, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుందామని ఎస్పీ తెలిపారు. చట్టం విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించమన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వ్యవసాయాన్ని దెబ్బతీసే అక్రమార్కులను చట్టపరంగా శిక్షించే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. అక్రమ విత్తనాల వ్యాపారాన్ని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ అక్రమ దందాకు సంబంధించి అక్రమార్కులపైనే కాకుండా వారికి సహకరించే అధికారులను సైతం వెలికి తీసేందుకు విచారణ చేస్తున్నామని ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ వెల్లడించారు.
Also Read: KTR – Kavitha: కేటీఆర్ వస్తేనే క్లారిటీ.. కవిత ఎపిసోడ్ పై చర్చించే అవకాశం!
కస్టడీలో ఉన్న నిందితులు
❄️1) చదలవాడ ఉపేందర్, తొర్రూరు
❄️2) శ్రీనివాస్ రెడ్డి, ఏజెంట్, ఆగ్రో రైతు సేవా కేంద్రం, బచ్చన్నపేట
❄️3) సురేష్, ఏజెంట్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, తరిగొప్పుల
❄️4) బుక్య వీరన్న డ్రైవర్
❄️5) బానోత్ సురేష్, డ్రైవర్
మరో నిందితుడు శేషాద్రి పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: Miss World 2025: చార్మినార్ విస్తుపోయేలా చేసింది.. ఒపల్ సుచాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్