Miss World 2025 (imagecredit:twitter)
తెలంగాణ

Miss World 2025: చార్మినార్ విస్తుపోయేలా చేసింది.. ఒపల్ సుచాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Miss World 2025: హైదరాబాద్‌లో గడిపిన ప్రతి క్షణం తనకు మాత్రమే కాదు, తన తోటి కంటెస్టెంట్స్‌కు కూడా మరచిపోలేని అనుభవం అని.. అవకాశమిస్తే మళ్లీ హైదరాబాద్ తప్పకుండా వస్తానని మిస్ వరల్డ్ ఒపల్ సుచాత చువాంగ్ శ్రీ అన్నారు. హైదరాబాద్ హోటల్ ట్రిడెంట్ హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ నిర్వహణకు ప్రభుత్వం అందించిన సపోర్ట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరువలేనిదని, వారు చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికి మదిలో నిలిచిపోతాయన్నారు. ఇక్కడి కళలు, సంప్రదాయాలు, డాన్స్, మ్యూజిక్ ఎంతో ఆకట్టుకున్నాయని మనసులోని మాటను బయటపెట్టారు. రామప్ప, చార్మినార్ నిర్మాణం విస్తుపోయేలా చేసిందని ఇది కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం అని ఆమె అన్నారు.

షీ టీమ్ గొప్ప ఆవిష్కరణ

అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో బాగుందని బాహుబలి సెట్ నచ్చిందన్నారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షీ టీం’ గొప్ప ఆవిష్కరణ అన్నారు. మహిళలు విద్య, వైద్య, ఐటీ, మొదలైన రంగాల్లో ఆవిష్కరణలు అభినందనీయం అని పేర్కొన్నారు. నేను గత మూడేళ్లుగా థాయిలాండ్లో బ్రెస్ట్ కాన్సర్ అవగాహనపై పని చేస్తూ ఫండ్ రైసింగ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇక పై తన పర్పస్ ప్రాజెక్ట్ తో పాటు ఇతర కంటెస్టెంట్స్‌ పర్పస్ ప్రాజెక్ట్స్ పై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తానని అదే మహిళా సాధికారత, సమస్యలపై పనిచేస్తానన్నారు. తన సేవాకార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆమె తెలిపారు.

Also Read: Rajiv Yuva Vikas Scheme: రాజీవ్ యువ వికాసం కోసం.. నెలకు 1500 కోట్లు..?

థాయిలాండ్‌కు ఇది మొట్టమొదటి క్రోన్

థాయిలాండ్‌కు ఇది మొట్టమొదటి మిస్ వరల్డ్ క్రోన్ అని, ఈ కిరిటం గెలుచుకోవడం నాకు గర్వకారణం మాత్రమే కాక, ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను అని ఆమె తెలిపారు. నా దేశ ప్రజలతో పాటు, హైదరాబాద్‌లో మా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటానని ఆమె చెప్పారు. క్రోన్ ప్రకటించిన క్షణం ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని ఆమె చెప్పారు. లక్ష్యం నిర్ధారించుకొని కష్టపడితే తప్పకుండ విజయం సాధిస్తారని ఆమె అన్నారు. ఇది నా ఒక్క దాని గెలుపు కాదని ప్రతి కంటెస్టెంట్ అదేవిధంగా వారి పర్పస్ గెలుపు అని ఆమె తన గెలుపును అభివర్ణించారు.

హైదరాబాద్ ఎంతో అందమైన నగరం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అందమైన నగరం అని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారన్నారు. ఇంత అద్భుతమైన అనుభవం పొందడం నా జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకం అని ఆమె పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన క్షణం నుంచే ప్రభుత్వం అందించిన సహకారం అద్భుతంగా ఉందన్నారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎంతో శ్రమించారాని వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించిన తీరు అందించిన సహకారం చిరస్మరణీయమన్నారు. మిస్ వరల్డ్ తరఫున, థాయిలాండ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

Also Read: Squid Game 3 Trailer: ప్రాణాలతో చెలగాటం.. ‘స్క్విడ్‌ గేమ్ 3’ ట్రైలర్ చూశారా?

 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!