Collector Advait Kumar Singh (magecredit:twitter)
నార్త్ తెలంగాణ

Collector Advait Kumar Singh: రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి.. కలెక్టర్ ఆదేశం!

Collector Advait Kumar Singh: రైతన్నలకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసి రైతు నేస్తంగా మారాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లాలోని అధికారులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించి, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఈ సంవత్సరం ‘నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగా గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన రైతులకు కొద్ధి మొత్తంలో పంపిణీ చేయబోతున్నామని కార్యక్రమ సమన్వయకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, డా. ఎస్. మాలతి, మల్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: Alcohol Addiction: మద్యం కోసం తాకట్లు.. రెండు వందలకు 2వేలు వసూళ్లు!

జూన్ 2న ప్రారంభం

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేయబడిన నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేయబడిన ముగ్గురు నుండి ఐదుగురు అభ్యుదయ రైతులకు అందజేయబడుతుందని తెలిపారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆలోచన, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు జూన్ 2న ఈ వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడుతుందని తెలిపారు. ఈ నాణ్యమైన విత్తనాన్ని రైతులు సాగు చేసి తదుపరి పంట ద్వారా ఉత్పత్తియైన విత్తనాన్ని గ్రామంలో తోటి రైతులకి అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అధికారుల ద్వారా సలహాలు

ఎంపిక చేయబడిన రైతులకు విత్తనోత్పత్తిపై ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా రానున్న రెండు మూడు సంవత్సరాలలో ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం విత్తన భద్రతలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్య ఆశయమని తెలిపారు.

Also Read: Rajiv Yuva Vikas Scheme: రాజీవ్ యువ వికాసం కోసం.. నెలకు 1500 కోట్లు..?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు