Alcohol Addiction: మద్యం మత్తులో సంసారాలు నాశనం అవుతున్నాయి. కిక్కు జోషులో మరింత కిక్కు కోసం జేబులో ఉన్న నగదును పూర్తిగా ఖర్చు చేస్తున్నారు. కొందరైతే మరికొందరు మందుబాబులు నగదు లేకా చేతుకున్న వాచ్ లు, మెడలో ఉన్న చైనులు, చేతి వేళ్ళకు ఉన్న ఉంగరాలు, జేబులో ఉన్న మొబైల్ లను తాకట్టు పెడుతున్నారు. ఈ రోజు తాకట్టు పెట్టిన వస్తువు రెండు రోజుల్లో విడిపించుకు పోకుంటే ఇండియాలో ఎక్కడ కూడా లేని ఇంట్రెస్ట్ వడ్డీస్తూ వసూలు చేస్తున్నారు. 200రూపాయల క్వాటర్ కోసం వస్తువు తాకట్టు పెట్టిన మందుబాబులు రెండు రోజుల్లో తిరిగి చెల్లించని పక్షంలో 2వేలు డిమాండ్ చేస్తున్నారు. 2వందలకు 2వేలు వసూలు చేయడం ఎంత దారుణం.
Also Read: Politics On Tirumala: తిరుమల వేదికగా మళ్లీ రాజకీయ రచ్చ.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం!
డబ్బులు లేకా తన వద్ద ఉన్న వస్తువులను తాకట్టు
ఇదంతా తతంగం ఎక్కడో కాదు.. సాక్షాత్తు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సాగుతున్న ఇదో తరహా దోపిడీ. వైన్స్ షాప్ ల కు అటాచ్ గా ఉన్న స్నాక్స్ షాప్, వాటర్, గ్లాస్ సప్లై దుకాణం, పాన్ షాప్లలో దోపిడీ అధికం అయ్యింది. వైన్స్ షాప్ ల పర్మిట్ రూమ్ లలో సిట్టింగ్ చేస్తున్న మందుబాబులు మద్యం సేవించిన పిమ్మట కిక్కు సరిపోక అదనంగా మద్యం సేవించేందుకు డబ్బులు లేకా తన వద్ద ఉన్న వస్తువులను తాకట్టు పెడుతున్నారు. మరుసటి రోజు వస్తువును విడిపించుకునేందుకు వెళ్తున్న వారికీ చేదు అనుభవాలు, దుఃఖం మిగులుతోంది. వైన్స్ దుకాణదారుల కన్ను సైగల్లో ఈ తరహా దోపిడీ జరుగుతున్నదన్న ప్రచారం జరుగుతోంది. మద్యం మత్తులో చిత్తుగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు భలంగా ఉన్నాయి. వస్తూవు తాకట్టు పెట్టుకుని పెద్ద మొత్తంలో నొక్కెయడం దారుణమని చెప్పవచ్చు.
అప్కారి సీఐ ఏమన్నారంటే..
వైన్స్ దుకాణాల్లో నగదు, పేటిఎంల ద్వారా మాత్రమే తీసుకుని మద్యం ఇవ్వాలని జహీరాబాద్ అప్కారి సీఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైన్స్ లలో గాని, వైన్స్ లకు అటాచ్ గా ఉన్న స్నాక్స్ తదితర షాపులలో వస్తూవులను తాకట్టు పెట్టుకుని మద్యం ఇచ్చినట్లు రుజువు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసారు.
Also Read: Sreeleela: శ్రీలీలకు నిశ్చితార్థం అయిపోయిందా? ఆ ఫొటోలేంటి?