Sreeleela Insta Post
ఎంటర్‌టైన్మెంట్

Sreeleela: శ్రీలీలకు నిశ్చితార్థం అయిపోయిందా? ఆ ఫొటోలేంటి?

Sreeleela: డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీలకు నిశ్చితార్థం (Sreeleela Engagement) అయిపోయిందా? ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను స్వయంగా శ్రీలీలే తన స్టేటస్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలలో ఆమెను చూసిన వారంతా.. ఏదో జరుగుతుంది? శ్రీలీల షాక్ ఇవ్వబోతుంది. బాలీవుడ్‌కి వెళ్లిన వెంటనే ఈ ట్విస్ట్ ఏంటి? నిజంగా ఆమెకు నిశ్చితార్థం అయిందా? లేదంటే ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఇలా చేసిందా? అంటూ ఒకటే కామెంట్స్.

ఎందుకంటే, శ్రీలీల ప్రస్తుతం యంగ్ హీరోయిన్. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన కూడా ఆమె నటిస్తోంది. అలాగే మీడియం రేంజ్ హీరోలందరూ శ్రీలీలనే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందంటే.. సినిమా వాళ్లవే కాదు.. ఆమె అభిమానించే కుర్రాళ్ల గుండెలు కూడా ఆగిపోవడం ఖాయం. అసలు విషయం ఏంటో చెప్పకుండా ఆమె ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేదెవరు? అని నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read- Hari Hara Veera Mallu: సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారా?

అసలింతకీ శ్రీలీల పోస్ట్ చేసిన ఫొటోలలో ఏముందంటే.. ఆమెకు పెద్దవాళ్లు పసుపు పూసి, చాలా సాంప్రదాయ బద్దంగా ఆశీర్వచనాలు అందిస్తున్నారు. బిగ్ డే, కమింగ్ సూన్ అంటూ ఈ ఫొటోలకు ఆమె క్యాప్షన్ జత చేసింది. అంటే, అంతా నిశ్చితార్థం జరిగిందనే అనుకుంటారు కదా. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తుందేమో.. అందుకే ఇలా క్యాప్షన్ పెట్టి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు నిశ్చితార్థం అవ్వలేదని.. ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు కదా. అవును, భయపడవద్దు.. ఆమెకి ఇంకా నిశ్చితార్థం ఏం కాలేదు. ఆమె సన్నిహితులు చెబుతున్న విషయం ఏమిటంటే..

Also Read- Venky vs Nag: వెంకీ, నాగ్ ఫ్యాన్స్ మధ్య వార్.. అస్సలు ఊహించలేదు కదా!

శ్రీలీల ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా, ఆ ఇంటి పెద్దలు ఇలా హాజరై సంప్రదాయబద్దంగా వేడుకని నిర్వహిస్తారట. మరో 14 రోజులలో శ్రీలీల పుట్టినరోజు ఉంది. ఆ రోజున ఆమె ఇంటిలో ఉండే అవకావం లేదని, అవుట్ డోర్ షూటింగ్‌తో బిజీగా ఉంటుందని తెలిసి, పెద్దలందరూ కలిసి ముందుగానే ఆమె బర్త్‌‌డేని సెలబ్రేట్ చేసినట్లుగా తెలుస్తుంది. అందుకే బిగ్ డే కమింగ్ సూన్ అని శ్రీలీల పోస్ట్ చేసి ఉంటుందని అంటున్నారు. ఆమె బర్త్‌ డే నిమిత్తమే ముందస్తుగా ఈ వేడుకని నిర్వహించారని, అంతకు మించి అక్కడ ఏం లేదనేది తాజా సమాచారం. మరి దీనిపై శ్రీలీల ఏమైనా ముందు ముందు రియాక్ట్ అవుతుందేమో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చలే నడుస్తున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు